Mem Famous: చివరికి కాకిని కూడా వదల్లేదుగా! ‘మేమ్ ఫేమస్’ టీమ్ ఫన్నీ ముచ్చట్లు
సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా కాకితో చిత్ర బృందం స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.
‘రైటర్ పద్మభూషణ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లహరి ఫిల్మ్స్, ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరో సరికొత్త సినిమాను తెరకెక్కిస్తున్నాయి. శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించడంతో పాటు సినిమాకు దర్శకత్వం వహించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఈనెల 26 న విడుదలకు రెడీ అవుతోంది.
కాకితో ‘మేమ్ ఫేమస్’ టీమ్ ఫన్నీ ఇంటర్వ్యూ
త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం వెరైటీగా ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను తమ సినిమా ప్రమోషన్స్‌కు వాడేసుకున్నారు. తాజాగా ఇప్పుడు కాకి వెంట పెట్టారు. ఇంతకీ కాకితో ప్రమోషన్స్ ఏంటనేగా మీ సందేహం? ఎందుకంటే.. గత కొద్ది కాలంగా అన్ని సినిమాల్లో కాకి కీలక పాత్ర పోషిస్తోంది. కాకి కేంద్రంగా సినిమాలు నడుస్తున్నాయి. ‘బలగం’, ‘విరూపాక్ష’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల కథలు కాకి చుట్టూనే తిరగాయి. ఈ నేపథ్యంలో ‘మేమ్ ఫేమస్’ చిత్రబృందం కాకి థీమ్‌తో ఇంటర్వ్యూ నిర్వహించింది. కాకితో ‘మేమ్ ఫేమస్’ టీమ్ ఫన్నీ ముచ్చట్లు చెప్పుకున్నారు. ఇంతకీ అవేంటో ఈ వీడియోలో చూడండి.
‘మేమ్ ఫేమస్’ మంచి మటన్ దావత్ లా ఉంటుంది!
‘మేమ్ ఫేమస్’ చిత్రం తెలంగాణలోని ఒక ఊరిలో జరిగే కథ. ఈ సినిమా కథకు తగినట్లుగా సుమారు 30 మంది కొత్త నటీనటులను తీసుకున్నారు. అందరూ అద్భుతంగా నటించినట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా ఓ మంచి మటన్ దావత్ మాదిరిగా ఉంటుందంటున్నారు. ఈ సినిమాను సెన్సార్ సభ్యులు సైతం ప్రశంసించినట్లు వెల్లడించారు. “యూట్యూబ్ లో సుమంత్ ప్రభాస్ షార్ట్ ఫిలిమ్స్ చూసిన తర్వాత అతడిని ఈ సినిమాకు సెలెక్ట్ చేశాం. ఆయన రాసిన కథతో ఫీచర్ ఫిల్మ్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. మేము అదే కథకు ఓకే చెప్పాం. తను ఆ కథతోనే ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా చాలా వరకు కొత్త వారితో రూపొందింది. ఇదో యూత్ ఫుల్ మూవీగా చెప్పుకోవచ్చు. ‘పెళ్లి చూపులు’, ‘జాతి రత్నాలు’ లాంటి సినిమాలు కలిస్తే ‘మేమ్ ఫేమస్’ లాంటి సినిమా వస్తుంది. యూత్ కోసం ఈ సినిమా తీసినా ఫ్యామిలీ అంతా చక్కగా చూసే అవకాశం ఉంటుంది. ఇది ముగ్గురు యువకుల కథ, వారి ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూసినప్పుడు యువకులు ప్రతి క్యారెక్టర్ కు కనెక్ట్ అవుతారు. రచయితగా, దర్శకుడుగా సుమంత్ ప్రభాస్ కు ఎలాంటి అనుభవం లేకున్నా ఈ సినిమాను అద్భుతంగా చేశారు. కల్యాణ్ నాయకు ఈ సినిమాక చక్కటి సంగీతం, అద్భుతమైన బీజీఎమ్ అందించారు” అని నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ తెలిపారు.
View this post on Instagram
Read Also: ఈ వారంలో చిన్న సినిమాల దూకుడు - థియేటర్, ఓటీటీ మూవీస్ ఇవే!