అన్వేషించండి

New Telugu Movies: ఈ వారంలో చిన్న సినిమాల దూకుడు - థియేటర్‌, ఓటీటీ మూవీస్‌ ఇవే!

ఎప్పటి లాగే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్‌తో పాటు, ఓటీటీలోనూ అలరించనున్నాయి. ఇంతకీ ఏ సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయి? ఏ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తాయో తెలుసుకుందాం.

మే చివరి వారంలో పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ వారం విడుదలయ్యే సినిమాలలో ఎక్కువగా చిన్న చిత్రాలే ఉన్నాయి. ఇక ఓటీటీలోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. 

థియేటర్లో విడుదలయ్యే సినిమాలు

‘మళ్లీ పెళ్లి’- మే 26న  విడుదల

నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 26న థియేటర్లలో విడుదలకు రెడీ అవుతున్నది. నరేష్, పవిత్ర లోకేష్ నిజ జీవితంలోని సంఘటలను బేస్ చేసుకుని ఈ సినిమా రూపొందించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.  

‘మేమ్‌ ఫేమస్‌’- మే 26న  విడుదల

సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తూ తెరకెక్కించిన సినిమా ‘మేమ్‌ ఫేమస్‌’.  ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిలింస్‌ బ్యానర్లపై  శరత్‌ చంద్ర, అనురాగ్‌ రెడ్డి, చంద్రు మనోహర్‌ సంయుక్తంగా నిర్మించారు. 30 మంది కొత్త నటీనటులతో  సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణలోని ఒక ఊరిలో జరిగే కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. 

‘2018’- మే 26న  విడుదల

టోవినో థామస్ హీరోగా జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘2018’. కేరళలో వచ్చిన భారీ వరదల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే కేరళలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా మే 26న తెలుగులో విడుదలకానుంది.   

ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!

‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’- జీ5- మే 26న విడుదల

సల్మాన్‌ఖాన్‌ హీరోగా ఫర్హద్‌ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా  ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’.  పూజా హెగ్డే,  వెంకటేష్ నటించిన ఈ చిత్రం మే 26వ నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది.

‘భేదియా’- జియో సినిమా- మే 26న  విడుదల

వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ కలిసిన నటించిన  చిత్రం ‘భేదియా’. తెలుగులో దీనిని ‘తోడేలు’ పేరుతో విడుదల చేశారు. అమర్‌ కౌశిక్‌ తెరకెక్కించిన ఈ సినిమా జియో సినిమాలో మే 26వ నుంచి స్ట్రీమింగ్‌ కు రానుంది.  

సిటడెల్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌- అమెజాన్‌ ప్రైమ్‌- మే 26న  విడుదల

ప్రతిష్టాత్మక స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘సిటడెల్‌’. రిచర్డ్‌ మ్యాడన్‌, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్,  ఏప్రిల్‌ 28 నుంచి వారానికి ఒక ఎపిసోడ్‌ చొప్పున విడుదల చేస్తున్నారు. చివరి ఎపిసోడ్‌ మే 26 స్ట్రీమింగ్‌ కు రానుంది.   

సత్తిగాని రెండెకరాలు- ఆహా- మే 26న విడుదల

అభినవ్ దండా దర్శకత్వం వహించిన 'సత్తిగాని రెండెకరాలు' వెబ్ మూవీ మే 26న ‘ఆహా’ ఓటీటీలో విడుదల కానుంది.    'పుష్ప' ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి ఈ సినిమా లో కథానాయుకుడిగా నటిస్తున్నారు. 'మైత్రీ మూవీ మేకర్స్' తొలిసారి ఈ వెబ్ చిత్రంతో ముందుకు వస్తోంది. ఈ సినిమాకు అభినవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ ఫిల్మ్ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.   

Read Also: నాకు ఒక శక్తి అండగా ఉంది, కష్టపడి నా కలలు నెరవేర్చుకున్నా: పవిత్ర లోకేష్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Dmart Stocks, Avenue Supermarts share price highlights: అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Embed widget