Chiranjeevi Salmankhan: ఆ సత్తా సల్మాన్ కే ఉంది, అందుకే ‘గాడ్ ఫాదర్’ సెట్లో అడుగు పెట్టాడు: చిరంజీవి
మెగాస్టార్ తాజా మూవీ ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంతకీ, ఆయనను ఈ సినిమాలో ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించారు మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మలయాళ హిట్ మూవీ ‘లూసీఫర్’కు రీమేక్ గా తెరకెక్కుతున్నది. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాకు సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు ఓరేంజిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కింది. సినిమాపై మరిన్ని అంచనాలను పెంచాయి.
చిరంజీవి మెయిన్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘లూసీఫర్’ సినిమాలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రను ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తొలుత తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు. కానీ, చివరకు తెలుగు, హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇందులో నయనతార సత్యప్రియ జయదేవ్ గా కనిపించబోతుంది. పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాని రామ్ చరణ్, ఎన్. వి. ప్రసాద్, ఆర్. బి. చౌదరి కలిసి నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో సల్మాన్ పవర్ ఫుల్ కామియో రోల్ చేస్తున్నాడు. ‘గాడ్ ఫాదర్’కు అన్నీ తానై ఉండే పాత్ర పోషిస్తున్నాడు. అసలు ఈ సినిమాలో సల్మాన్ ను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చిరంజీవి చెప్పారు. “ఒక రాజుకు దళపతి ఉన్నట్లుగానే ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నాకు సల్మాన్ అలాగే ఉంటాడు. నా కోసం ప్రాణాలు ఇచ్చేంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఒక్కమాటలో చెప్పాలంటే నా సోల్ మేట్ అన్నమాట. ఈ సినిమాలో నేను చేసే ప్రతి పనిలో తను వెన్నంటి ఉంటాడు. నాకు అన్ని రకాలుగా అండదండలు అందిందే ఫర్ఫెక్ట్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కు మంచి ఇమేజ్ కావాలి. దాన్ని క్యారీ చేసే సత్తా ఉండాలి అనుకున్నాం. ఈ సినిమాలో సల్మాన్ ఆయన క్యారెక్టర్ ఓ పది నిమిషాలు ఉండొచ్చు.అయినా, నన్ను నిలబెట్టి తను లీడ్ చేస్తాడు. అందుకే, అంత ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ అయితేనే.. నేను కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకున్నా అతను ముందుకు వెళ్లి సీన్ నడిపించగలడు అనుకున్నాం. ఈ క్యారెక్టర్ చేసే ఛాన్స్ కేవలం సల్మాన్ కే ఉందని మాకు అనిపించింది. ఇదే విషయాన్ని దర్శక నిర్మాతలు నన్ను అడిగారు. నేను, చరణ్ సల్మాన్ ను అడిగితే కాదని చెప్పే ప్రసక్తే లేదు అనుకున్నాం. చరణ్ వెళ్లి సల్మాన్ తో చెప్పాడు. నాన్న సినిమాలో ఓ క్యామియో క్యారెక్టర్ ఉంది. నాన్నకు సపోర్టుగా ఉంటుంది. చాలా పాజిటివ్ క్యారెక్టర్ అని చెప్పారు. డాడీ నేను న్యాయం చేయగలనని అన్నారా? అని సల్మాన్ అడిగాడట. ఆయన ఓకే అంటే.. నేను తప్పకుండా చేస్తాను అని చెప్పారట. చెప్పినట్లే చేశాడు కూడా. సల్మాన్ ఈ సినిమాలో చేయడం వల్ల ఓ నిండుతనం వచ్చింది. అతడి మూలంగా ఫీల్ గుడ్ అట్మాస్పియర్ కలిగింది.” అని చిరంజీవి చెప్పారు.
Also read: నామినేషన్లో ఇనయా వయసుపై చర్చ, యాటిట్యూడ్ చూపించిన శ్రీహాన్
Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!
View this post on Instagram