News
News
X

God Father Teaser: 'వెయిట్ ఫర్ మై కమాండ్' - 'గాడ్ ఫాదర్' టీజర్ వచ్చేసింది!

రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'గాడ్ ఫాదర్' టీజర్ ని వదిలారు.

FOLLOW US: 

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య'(Acharya) సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో నిర్మాతలు బాగా నష్టపోయారు. దీంతో తన తదుపరి సినిమాతో పెద్ద హిట్ అందుకోవాలని చూస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'గాడ్ ఫాదర్' టీజర్(God Father Teaser)ని వదిలారు. ఈ వీడియోతో మెగా ఫ్యాన్స్ కి మాసివ్ ట్రీట్ ఇచ్చారు మెగాస్టార్. 

'ఇరవై ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు.. సడెన్ గా తిరిగొచ్చిన ఆరేళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు' అంటూ హీరో క్యారెక్టర్ గురించి చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది. సత్యదేవ్ రోల్ ని చాలా అగ్రెసివ్ గా చూపించారు. నయనతార, సల్మాన్ ఖాన్ లను కూడా టీజర్ లో చూపించారు. 'వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్' అంటూ చిరు చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. 

కథ ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు. అలానే చిరు, సల్మాన్ ల కాంబినేషన్ లో ఓ పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. 

మలయాళంలో  సూపర్‌ స్టార్ మోహన్‌లాల్(Mohan lal) నటించిన 'లూసిఫర్'కి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. . పృథ్వీరాజ్ సుకుమారన్  దర్శకత్వంలో తెరకెక్కిన 'లూసిఫర్' చిత్రం భారీగా వసూళ్లను సాధించింది. అదే రేంజిలో ఇక్కడ కూడా సినిమా సక్సెస్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు.

Also Read : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ షురూ - బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్‌కు దిమ్మ‌తిరిగే రియాక్షన్

Also Read : సిక్స్ ప్యాక్ చూపించడానికి రెడీ అవుతున్న మహేష్ బాబు!

Published at : 21 Aug 2022 07:04 PM (IST) Tags: Megastar Chiranjeevi god father movie God Father movie teaser director mohan raja

సంబంధిత కథనాలు

DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?

DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!

Chiranjeevi: మెగా నిర్మాతల నిర్ణయం - 'గాడ్ ఫాదర్'ని మలయాళంలో రిలీజ్ చేస్తారా?

Chiranjeevi: మెగా నిర్మాతల నిర్ణయం - 'గాడ్ ఫాదర్'ని మలయాళంలో రిలీజ్ చేస్తారా?

Nayanthara: నయనతార ప్రెగ్నెంట్? విఘ్నేష్ శివన్ పోస్ట్ వైరల్

Nayanthara: నయనతార ప్రెగ్నెంట్? విఘ్నేష్ శివన్ పోస్ట్ వైరల్

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

టాప్ స్టోరీస్

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

MS Dhoni: ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

MS Dhoni:  ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం