Bhola Shankar: చిరు లీక్స్ - ‘భోళా శంకర్’ సాంగ్ షూట్‌లో మెగాస్టార్ నవ్వుల సందడి, ఫ్యాన్స్ ఫిదా!
చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’ నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. మూవీలోని సంగీత్ పాట ‘జామ్ జామ్ జజ్జనకా’ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను గ్లింప్స్ ను లీక్ చేశారు.
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు అదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ అదిరిపోయే స్టెప్పులేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా ‘భోళా శంకర్’. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మూవీకు సంబంధించిన అప్డేట్ లను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మూవీలోని మరో పాటకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి లీక్ చేశారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ పాటకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘జామ్ జామ్ జజ్జనకా’ పాటను లీక్ చేసిన చిరంజీవి..
చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’ నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. మూవీలోని సంగీత్ పాట ‘జామ్ జామ్ జజ్జనకా’ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను గ్లింప్స్ ను లీక్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి చాలా యంగ్ అండ్ యనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన సెట్స్ కూడా చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తున్నాయి.శేఖర్ మాస్టర్ పాటకు కొరియోగ్రాఫ్ చేస్తుండగా తమన్నా, కీర్తి సురేష్ తో కలసి స్టెప్పులేస్తున్నారు. అలాగే ఈ సాంగ్ లో హీరో సుశాంత్, వెన్నెల కిషోర్, గెటప్ శీను, హైపర్ ఆది, రఘు బాబు ఇలా మూవీలో ఉన్న ఆర్టిస్ట్ లు అందరూ కనిపిస్తున్నారు. షూటింగ్ సమయంలో అందరూ సరదాగా గడిపిన సన్నివేశాలు వీడియోలో కనిపిస్తున్నాయి. చిరంజీవి ఈ లీక్ తో మూవీ పై అంచనాలు మరిన్ని పెంచేస్తున్నారనే చెప్పాలి. ఇక ఈ మూవీకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.
చిరు లీక్స్ తో మూవీ అప్డేట్స్..
చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన అప్డేట్ లను చిరు లీక్స్ తో అభిమానులతో పంచుకుంటున్నారు. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా షూటింగ్ టైమ్ లోనూ ఇలాగే మూవీలోని పాటల గురించి సోషల్ మీడియా ఖాతా ద్వారా ఫోటోలు, వీడియోల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్ట్ లు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ‘భోళా శంకర్’ సినిమాకు కూడా అదే ట్రెండ్ ను ఫాలో అయ్యారు చిరు. ఇప్పటికే ఈ సినిమాలోని ఓ పాట గురించి తన ట్విట్టర్ ఖాతాలో చెప్పుకొచ్చారు. అక్కడ లొకేషన్స్ ను ఫోటోలు తీసి షేర్ చేశారు. ఇప్పుడు ఈ మూవీలో మరో సంగీత్ సాంగ్ గురించి ముందే ట్విట్టర్ లో లీక్ చేశారు. మూవీలో ఈ సంగీత్ పాట చాలా బాగా వచ్చిందని, చాలా సందడిగా షూటింగ్ జరిగిందన్నారు. తర్వాత పాటకు సంబంధించిన మేకింగ్ వీడియో గ్లింప్స్ ను అభిమానుల కోసం తన షోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇలా తన సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకొని అభిమానుల్ని మరింత ఉత్సాహపరుస్తున్నారు మెగాస్టార్. మరి ఈ ‘భోళా శంకర్’ మూవీతో చిరు ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.
View this post on Instagram