Megastar Helps Fan: 'మెగా'స్టార్ మనసుకు ఫ్యాన్స్ ఫిదా... అభిమాని కుమార్తె పెళ్లికి ఆయన ఏం చేశారంటే?
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తనది మెగా మనసు అని చాటుకున్నారు. అభిమాని కుమార్తె పెళ్లికి ఆయన సాయం చేశారు.
![Megastar Helps Fan: 'మెగా'స్టార్ మనసుకు ఫ్యాన్స్ ఫిదా... అభిమాని కుమార్తె పెళ్లికి ఆయన ఏం చేశారంటే? Megastar Chiranjeevi Financially Helps His Fan Rajam KondalaRao Daughter Neelaveni Marraige Megastar Helps Fan: 'మెగా'స్టార్ మనసుకు ఫ్యాన్స్ ఫిదా... అభిమాని కుమార్తె పెళ్లికి ఆయన ఏం చేశారంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/7088e42d373b26781be014c8e3ffe571_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సినిమాలో చిరంజీవి మెగాస్టార్. అభిమానులకు మాత్రం ఆయన అన్నయ్య. ఎప్పుడూ అభిమానులు అందరూ తన సోదరులు అని చెబుతుంటారు. వాళ్లకు సహాయాలు కూడా చేస్తుంటారు. తాజాగా ఓ అభిమాని కుమార్తె పెళ్లికి ఆయన చిరు సాయం చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ అభిమానుల సంఘం 'అఖిల భారత చిరంజీవి యువత' అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు తెలియజేశారు.
చిరంజీవి వీరాభిమానుల్లో రాజాం కొండలరావు ఒకరు. ఆయన కుమార్తె నీలవేణి పెళ్లి కుదిరిందని తెలుసుకున్న చిరంజీవి, లక్ష రూపాయల సాయం అందించారు. "లక్షణనమైన పెళ్లి కూతురు నీలవేణికి మెగాస్టార్ ఆశీస్సులు... లక్ష రూపాయలు విరాళం. రాజాం కొండలరావు గారు మొదట్నుంచీ శ్రీ చిరంజీవి గారి వీరాభిమాని. ఆయన కూమార్తె నీలవేణి పెళ్లి కుదిరింది. సమాచారం అందుకున్నచిరంజీవి గారు లక్షరూపాయల ఆర్ధిక చేయూత ఇచ్చి పెళ్లి సజావుగా జరిపించమని చెప్పారు" అని రవణం స్వామినాయుడు ట్వీట్ చేశారు. మెగాస్టార్ స్ఫూర్తితో కొంత మంది అభిమానులు కూడా ఈ పెళ్లికి సాయం చేయడానికి ముందుకు వచ్చారని తెలిసింది.
అభిమానులకు మాత్రమే కాదు... చలన చిత్ర పరిశ్రమలో కార్మికుల కోసం కూడా చిరంజీవి ఆలోచిస్తూ ఉంటారు. కరోనా కాలంలో 'కరోనా క్రైసిస్ చారిటీ' నెలకొల్పి పరిశ్రమ ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించి ఎంతో మంది నిత్యావసర వస్తువులు అందించారు. అలాగే, ఇటీవల హెల్త్ కార్డులు అందజేసేలా కృషి చేశారు. ఆయన కుటుంబం నుంచి వచ్చిన హీరోలు కూడా తమ వంతు ఆర్థిక సాయం అందిస్తున్నారు.
లక్షణనమైన పెళ్లికూతురు నీలవేణి కి మెగాస్టార్ ఆశీస్సుల లక్ష రూపాయలు విరాళం.
— Ravanam Swami naidu (@swaminaidu_r) February 1, 2022
రాజాం కొండలరావు గారు మొదట్నుంచీ శ్రీ చిరంజీవి గారి వీరాభిమాని.ఆయన కూమార్తె నీలవేణి పెళ్లి కుదిరింది. సమాచారం అందుకున్న @KChiruTweets గారు లక్షరూపాయల ఆర్ధిక చేయూతనిచ్చి పెళ్లి సజావుగా జరిపించమన్నారు pic.twitter.com/YVmpUaSR4b
మెగాస్టార్ బాటలోనే నడిచే అభిమానులమైన మేం కూడా పెళ్లికూతురికి అభినందనల్తో పాటూ హితోదికంగా ఆర్థికం గా మరో లక్ష రూపాయలు చేయూతనందించడం మాకు అందరికి ఆనందంగా ఉంది.
— Ravanam Swami naidu (@swaminaidu_r) February 1, 2022
ఈ కొత్త జంటను ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ...
*అఖిల భారత చిరంజీవి యువత*
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)