Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి
‘వాల్తేరు వీరయ్య’ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13 న విడుదల అయిన ఈ సినిమా సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచింది. మూవీ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా విజయోత్సవ సభను ఏర్పాటు చేసింది మూవీ టీమ్.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచింది. మూవీ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా విజయోత్సవ సభను ఏర్పాటు చేసింది మూవీ టీమ్. ఈ నెల 28న వరంగల్ లోని వీరయ్య విజయ విహారం పేరుతో భారీ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది : చిరంజీవి
‘వాల్తేరు వీరయ్య’ సినిమా విజయం సాధిస్తుందని అనుకున్నాం కానీ, ఇంత భారీ సక్సెస్ వస్తుందని ఊహించలేదని అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా నాన్ ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల స్థాయికి వెళ్తుందని అనుకోలేదన్నారు. ప్రేక్షకుల ఆదరణ వలనే ఇంతటి విజయం అందిందని అన్నారు. ఈ సినిమా మొత్తం 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే మామూలు విషయం కాదని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఈ మూవీ విజయానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీనే అని అన్నారు. ఆయన తండ్రి కూడా మెగా అభిమాని అని, తన తండ్రి బాబీకు చదువును ఎంత నూరిపోశారో తెలీదు గానీ అభిమానాన్ని మాత్రం బాగా నూరిపోశారని.. అదే ప్రేమను బాబీ ఈ చిత్రంలో చూపించాడని అన్నారు. ఈ మూవీతో బాబీ స్టార్ డైరెక్టర్ అయ్యాడని వ్యాఖ్యానించారు. రవితేజను చూస్తే మరో పవన్ కళ్యాణ్ లా కనిపిస్తాడని, అందుకే అతని అంత సోదరభావం ఉంటుందని అన్నారు. సినిమాలో కూడా అదే ఊహించుకున్నానని, అందుకే సన్నివేశాలు అంత బాగా వచ్చాయని చెప్పారు.
అలాగే రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా చూస్తున్నప్పుడు కూడా రామ్ చరణ్ ఎక్కడా కనిపించడని చిట్టిబాబు పాత్రే కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికీ చిట్టిబాబు పాత్ర గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని అంతకు మించిన అవార్డులు ఏముంటాయని వ్యాఖ్యానించారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో చరణ్ విశ్వరూపం చూపించాడు. అలాగే ఎన్టీఆర్ కూడా చాలా బాగా నటించాడని అన్నారు. ‘నాటు..నాటు..’ పాట ఈ రోజున గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడమే కాకుండా ఆస్కార్ కు నామినేషన్ కు ఎంపికయ్యింది అంటే తెలుగు వారికి ఇంతకన్నా గొప్ప గర్వకారణ విషయం ఏముంటుందని అన్నారు.
ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మొదట్లో యావరేజ్ టాక్ వచ్చినా తర్వాత మౌత్ పబ్లిసిటీతో హిట్ టాక్ తెచ్చుకుంది. మూవీలో చిరంజీవి వింటేజ్ నటన, యాక్షన్ సీన్స్, అన్నదమ్ముల సెంటిమెంట్, కామెడీ ఇలా అన్ని ఈ సినిమాలో ఉండటంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూకట్టారు. దీంతో తొలి నాలుగు రోజుల్లోనే ఈ మూవీ నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా క్రాప్ చేయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రూ.రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించి చిరంజీవి సినిమా కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది.
Read Also: ఔను, ఇద్దరం వెకేషన్‌కు వెళ్లాం, కానీ - విజయ్‌తో ప్రేమాయణంపై రష్మిక కామెంట్స్