By: ABP Desam | Updated at : 26 Jun 2022 03:26 PM (IST)
మెగాస్టార్ సినిమాలో విలన్ గా బిజు మీనన్?
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈ సినిమాలో చిరంజీవి ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా.. అది బాగా వైరల్ అయింది. ఈ సినిమా కోసం స్టార్ క్యాస్ట్ ను తీసుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. అలానే కోలీవుడ్ నటుడు బాబీ సింహా మరో ముఖ్య పాత్ర పోషించనున్నారు.
ఇక విలన్ గా సముద్రఖనిని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే పనిలో పడ్డారు. అందుకే నటుడిగా సినిమాలు సైన్ చేయడం లేదు. ఇప్పుడు మెగాస్టార్ సినిమాను కూడా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు బదులుగా మరో నటుడిని రంగంలోకి దింపాలనుకుంటున్నారు. ఆయన మరెవరో కాదు.. బిజు మీనన్.
మలయాళంలో చాలా సినిమాలే చేశారు బిజు మీనన్. తెలుగులో కూడా 'ఖతర్నాక్', 'రణం' వంటి సినిమాలు చేశారు. టాలీవుడ్ లో ఈయన పెద్దగా ఫేమస్ కానప్పటికీ.. మాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. 'అయ్యప్పన్ కోశియుమ్' సినిమాతో ఈయన రేంజ్ మరింత పెరిగింది. ఇప్పుడు బిజు మీనన్ ను టాలీవుడ్ కి మళ్లీ తీసుకురావాలనుకుంటున్నారు. చిరు సినిమాలో బిజు మీనన్ ను విలన్ గా తీసుకోవాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భావిస్తోంది.
ఆయన గనుక ఓకే చెబితే తెలుగులో విలన్ గా బిజీ అవ్వడం ఖాయం. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపుగా దీన్నే ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
Also Read: ప్రభాస్ పార్టీలో అమితాబ్, దుల్కర్ - వైరల్ అవుతోన్న వీడియో
Also Read: చైతుతో డేటింగ్ రూమర్స్ - మిడిల్ ఫింగర్ చూపించిన శోభితా?
Big Boss Fame Samrat: ‘బిగ్ బాస్’ ఫేమ్ సామ్రాట్ ఇంట్లో సంబరాలు - కూతురి ఫస్ట్ ఫొటో షేర్ చేసిన నటుడు
Mahesh Babu: ఫిట్నెస్ మాంత్రికుడి దగ్గరికి ప్రిన్స్ - అభిమానులకు త్వరలో మహేష్ బాబు సర్ప్రైజ్
Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం
Puri Jagannadh: ఒక్కోసారి చార్మీ ఏడుస్తుంది, నా భార్య వల్లే కొత్త కథలు: పూరీ జగన్నాథ్
Janaki Kalaganaledu August 16th Update: గర్ల్ ఫ్రెండ్ జెస్సితో అఖిల్ రొమాన్స్, మల్లికని ఓ ఆట ఆడుకున్న గోవిందరాజులు- జ్ఞానంబ ఇంట్లో రాఖీ సంబరాలు
Rakesh Jhunjhunwala: మరణించాక, తొలి ట్రేడింగ్ సెషన్లో ఝున్‌ఝున్‌వాలా షేర్లు ఎలా ఉన్నాయంటే?
Khammam Politics: ఖమ్మంలో మళ్లీ మొదలైన హత్యా రాజకీయాలు - తెల్దారుపల్లి ఎందుకంత కీలకం !
Amitabh Chaudhry Passes Away: అమితాబ్ చౌదరి కన్నుమూత - బీసీసీఐ సహా క్రికెటర్ల దిగ్భ్రాంతి!
BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్లో బీజేపీ వ్యూహం ఫలించేనా?