By: ABP Desam | Updated at : 08 Jan 2023 09:58 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Mallemalatv/You Tube
మెగాస్టార్ చిరంజీవికి పబ్లిక్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో పైకొచ్చిన చిరంజీవి అంటే అందరికీ అభిమానమే. ఇక ఆయన యాక్టింగ్, డైలాగ్స్, ఫైట్స్ మాత్రమే కాదు ఆయన కామెడీ టైమింగ్ కు కూడా పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల అయిన పాటలు, ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. అయితే సినిమా విడుదలకు ముందు థియేటర్లలో కంటే బుల్లితెరపై సందడి చేయడానికి సిద్దమయ్యారు చిరు. ఓ ప్రముఖ చానెల్ లో యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న ‘సుమ అడ్డా’ కార్యక్రమంలో పాల్గొన్నారు చిరంజీవి. దీనికి సంబంధించిన ప్రోమోను ఇటీవలే విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి సాధారణంగా టీవీ షో లలో తక్కువగా కనిపిస్తుంటారు. అయితే చాలా రోజుల తర్వాత చిరు ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొనడంతో ఈ ప్రోగ్రాంపై ఆసక్తి నెలకొంది. ‘సుమ అడ్డా’ కార్యక్రమంలో చిరంజీవితో పాటు ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ, నటుడు వెన్నెల కిషోర్ లు కూడా పాల్గొన్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవితోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం విశేషం. ఇక ఈ ప్రోమోలో చిరంజీవి చేసిన సందడి అంతా ఇంతా కాదు. తన కామెడీ టైమింగ్ తో సుమాను ముప్పతిప్పలు పెట్టారు చిరు. ఆయన పంచ్ డైలాగ్స్ తో యాంకర్ సుమ ఉక్కిరిబిక్కిరైపోయింది. ఈ ప్రోమో లో చిరంజీవి రోల్స్ రాయిస్ కారులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. విద్యుల్లేఖ రామన్ బామ్మ వేషంలో వచ్చి చిరంజీవి చేయి పట్టుకొని రేఖలు చూస్తూ.. ‘‘సార్ మీకు ఈ రేఖల్లో ఏ రేఖ అంటే భయం’’ అని అడగ్గా.. చిరంజీవి ‘సురే...’ అంటూ మళ్లీ అమయాకంగా నవ్వుతూ ఆపేశారు. ఈలోపు యాంకర్ సుమ కలుగజేసుకొని ‘‘ఆయన లక్ష్మణ రేఖనైనా దాటతారేమో కానీ సురేఖను మాత్రం దాటరు’’ అంటూ పంచ్ వేశారు.
ఇక తర్వాత ఆడియన్స్ లో ఒక అబ్బాయి స్టేజీ పైకి వచ్చి సుమతో మాట్లాడుతూ.. ‘‘డాక్టర్ గారూ, బాగా తిని పొట్ట వచ్చేస్తుంది అండీ ఏం చేయమంటారు’’ అని అడిగితే దానికి వెంటనే చిరంజీవి ‘‘తొమ్మిది నెలలు తర్వాత రమ్మనండి, తీసేస్తాం’’ అంటూ పంచ్ వేశారు. దీంతో షో మొత్తం నవ్వులు పూచాయి. ఇలా షో ప్రోమో మొత్తం తన కామెడి టైమింగ్ తో నవ్వులు పూయించారు చిరు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ కేవలం ప్రోమోకే ఇలా ఉంటే ఇక ఫుల్ షో ఎలా ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ షో జనవరి 14న ప్రసారం కానుంది. ఇక చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరి 13న విడుదల కానుంది.
Read Also: ఆటోలో అక్షయ్ భార్య, కూతురు నితారతో షికారు!
Dhanush Speech: తెలుగు, తమిళ ప్రజలు ఎంత దగ్గరివారో తెలిసింది - ‘సార్’ ట్రైలర్ లాంచ్‌లో ధనుష్ ఏమన్నారంటే?
Siri Hanmanth Emotional: షర్ట్‌పై కిస్ చేసేదాన్ని - తప్పు చేశానంటూ ఏడ్చేసిన సిరి, ఓదార్చిన శ్రీహాన్
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి