అన్వేషించండి

Twinkle Khanna: ఆటోలో అక్షయ్ భార్య, కూతురు నితారతో షికారు!

అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా ఆటోలో ప్రయాణం చేశారు. కూతురు నితారతో కలిసి ముంబైలో షికారుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రముఖ నటి, రచయిత్రి, బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా హాయిగా ఆటోలో జర్నీ చేశారు. తన కూతురు నితారతో కలిసి సరదాగా ఆటోలో వెళ్లారు.  ఆమెను గమనించి జర్నలిస్టులు ఫోటోలను క్లిక్ అనిపించారు. వారి ఉత్సాహాన్ని చూసి భయ్యా కాసేపు ఆటో ఆపండి అని చెప్పారు. ఫోటోలకు తల్లీ కూతురు ఫోజులిచ్చారు. ఆ తర్వాత ఆటోలో అక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు. చాలా కాలం తర్వాత ఆటో ఎక్కడంతో “బహుత్ అచ్చా హువా” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. నితార కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యింది. ఇక ట్వింకిల్ గోల్డెన్ శాండల్స్‌ తో కూడిన కలర్ ఫుల్ డ్రెస్ వేసుకున్నారు. నితార పర్పుల్ టాప్, షార్ట్, స్నీకర్స్‌ లో కనిపించింది. ట్వింకిల్ ఒక బ్యాగ్, ఒక పుస్తకాన్ని కూడా తీసుకెళ్తూ కనిపించారు. చేతిలో ఒక పర్సు ఉంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna)

నితార ట్వింకిల్, అక్షయ్ కుమార్‌ చిన్న కూతురు. కొడుకు పేరు ఆరవ్. ఇటీవల, ట్వింకిల్ తన 48వ పుట్టిన రోజును తన కుటుంబ సభ్యలతో కలిసి జరుపుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ లో తన బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. ఈ సందర్భంగా "నేను చాలా ఇష్టపడే వ్యక్తులందరితో పరిపూర్ణ పుట్టినరోజు జరుపుకున్నాను. మీ అందరి శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని చెప్పారు. 

2015లో రచనా రంగంలోకి అడుగు పెట్టిన ట్వింకిల్

2001 వరకు సినిమాల్లో నటించిన ట్వింకిల్ ఖన్నా ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత రచయిత్రిగా మారారు. 2015లో ఆమె తన తొలి పుస్తకం ‘Mrs ఫన్నీబోన్స్‌’ను విడుదల చేసింది.  ట్వింకిల్ 2017లో ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’ అనే కథా సంకలనాన్ని రాశారు. ఆ తర్వాత ‘పైజామా ఆర్ ఫర్గివింగ్’ అనే మరో పుస్తకాన్ని విడుదల చేశారు.

‘రామ్ సేతు’తో సూపర్ హిట్ అందుకున్న అక్షయ్

అటు  అక్షయ్ ఇటీవల జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘రామ్ సేతు’లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర హిట్ అందుకుంది. ప్రస్తుతం తను ‘సెల్ఫీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అక్షయ్‌తో పాటు, ఇమ్రాన్ హష్మీ, డయానా పెంటీ, నుష్రత్ భరుచ్చా  నటిస్తున్నారు. నిర్మాత రాజ్ మెహతా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Read Also: అంతకాలం ఇండస్ట్రీలో ఉండటం చిన్న విషయం కాదు, అదే తన అసలు లక్ష్యమన్న నయనతార

టాప్ హెడ్ లైన్స్

OG Sequel Update : OG సీక్వెల్ బిగ్ అప్డేట్ - పవన్ కల్యాణ్ సార్... స్టోరీ ఎలా ఉంటుందంటే?
OG సీక్వెల్ బిగ్ అప్డేట్ - పవన్ కల్యాణ్ సార్... స్టోరీ ఎలా ఉంటుందంటే?
Peddi : పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?
పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Anil Ravipudi : రక్తం చిందించిన అనిల్ రావిపూడి - మరీ అంత వయలెన్స్ అవసరమా?
రక్తం చిందించిన అనిల్ రావిపూడి - మరీ అంత వయలెన్స్ అవసరమా?

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
Ananya Nagalla : అనన్య 'యోగ'మ్... పీస్ ఫుల్ 'ఆరోగ్య'మ్ - ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్
అనన్య 'యోగ'మ్... పీస్ ఫుల్ 'ఆరోగ్య'మ్ - ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్
Embed widget