By: ABP Desam | Updated at : 15 Feb 2022 07:13 PM (IST)
బాలయ్య సినిమాలో మీరాజాస్మిన్?
నందమూరి బాలకృష్ణ ఇటీవల 'అఖండ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమా రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులూ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.
చాలాకాలంగా అనిల్ రావిపూడి.. బాలయ్య డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం క్యాస్ట్ ను వెతికే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాలో కీలకమైన రోల్ ఒకటి ఉంది. అదే బాలయ్య డాటర్ క్యారెక్టర్. దానికోసం యంగ్ హీరోయిన్ శ్రీలీలను తీసుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.
సినిమా మొత్తం ఈ క్యారెక్టర్ చుట్టూనే తిరిగుతుందట. రెమ్యునరేషన్ ఓకే అయితే శ్రీలీల ఈ సినిమాలో కనిపించడం ఖాయం. ఇక బాలయ్య సరసన హీరోయిన్ గా నటి మీరాజాస్మిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి హీరోలతో కలిసి రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో హాట్ హాట్ ఫొటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె అవతారం చూస్తుంటే హీరోయిన్ రోల్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఉంది. ఇప్పుడు బాలయ్య సినిమాలో ఛాన్స్ వస్తే మంచి క్రేజ్ వస్తుంది కాబట్టి కచ్చితంగా ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి 'మహారథి' అనే సినిమాలో నటించారు. ప్రస్తుతానికతే ఆమె పేరు పరిశీలనలో ఉంది. మరి దర్శకనిర్మాతలు ఏం డిసైడ్ అవుతారో చూడాలి!
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!
Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు
Pakka Commercial: 'పక్కా కమర్షియల్' సెకండ్ సాంగ్ ప్రోమో!
Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని
Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి
NTR Centenary Celebrations : ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !
Minister Sabitha Indrareddy అనుచరుల వీరంగం.. అధికారుల అంతు చూస్తామని బెదిరింపులు | ABP Desam
RR vs RCB, Mohammed Siraj: ఇదేంది సిరాజ్ మియా! హైదరాబాదీ పేస్ కెరటం కెరీర్లో కోరుకోని రికార్డు