Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?
‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో మంచి హిట్ అందుకుంది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసింది. అయితే అమ్మడుకి సరైన హిట్ అందలేదు. ఇప్పటికీ సరైన హిట్ కోసం ఎదురు చూస్తోంది ఈ బ్యూటీ.
Maya Petika Movie: మనిషి జీవితంలో సెల్ ఫోన్ కూడా ఒక భాగమైపోయింది. ఏం చేసినా అన్నీ సెల్ ఫోన్ లోనే చేస్తున్నారు. అంతలా సెల్ ఫోన్ మనిషిని అతుక్కుపోయింది. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి దగ్గరా ఓ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అలాంటిది సెల్ ఫోన్ కే ఓ కథ ఉంటే. దాని మీద కొంత మంది జీవితాలు ఆధారపడి ఉంటే ఎలా ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ తోనే ‘మాయా పేటిక’ అనే ఓ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు రమేష్ రాపర్థి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ బయటకొచ్చింది. మూవీ విడుదల తేదీను ప్రకటించారు మేకర్స్. జూన్ 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
టీజర్ తో ఆకట్టుకున్న ‘మాయా పేటిక’..
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన టీజర్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. మూవీలో పాయల్ రాజ్ పుత్, రజిత్ రాఘవన్, సునీల్, యాంకర్ శ్యామల, సిమ్రత్ కౌర్ తదితరులు నటించారు. టీజర్ వీడియోలో రానా దగ్గుబాటి లీడ్ వాయిస్ ను అందజేశారు. దీంతో ఈ మూవీ పై ఆసక్తి నెలకొంది. టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో మూవీ పై బజ్ పెరిగింది. ఓ సెల్ ఫోన్ చేతులు మారి ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరకూ వెళ్తూ ఉంటుంది. అలా వారి దగ్గరకు ఆ ఫోన్ వచ్చినపుడు ఏం జరిగింది. ఆ ఫోన్ వారందరి జీవితాలను ఎలా మార్చింది. అసలు ఆ ఫోన్ లో ఏముంది అనేదే కథ. కామెడీ డ్రామా కాన్సెప్ట్ తో మూవీను తెరకెక్కించారు దర్శకుడు రమేష్.
పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో..
‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో మంచి హిట్ అందుకుంది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసింది. అయితే అమ్మడుకి సరైన హిట్ అందలేదు. ఇప్పటికీ హిట్ కోసం ఎదురు చూస్తోంది ఈ బ్యూటీ. గతేడాది ‘జిన్నా’ మూవీ పర్వాలేదనిపించినా హిట్ టాక్ ను తెచ్చుకోలేదు. అయినా వరుస మూవీ అవకాశాలు వస్తున్నాయి. ఈసారి ఈ కామెడీ జోనర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పాయల్. అయితే ఈ సినిమాలో పాయల్ ఎలాంటి పాత్రలో నటిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీకు గుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గుణ బాల సుబ్రమణ్యం సంగీతాన్ని సమకూరుస్తుండగా సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ గా చేశారు. ఇక ఈ మూవీ జూన్ 30 ప్రేక్షకుల ముందుకు రానుంది.
Fully 'CHARGED' & All set to 'CAPTURE' your hearts & lit the 'SCREENS' 🥁#MayaPetika Release Date unveiled by @KeerthyOfficial 🥳
— Ramesh Bala (@rameshlaus) June 9, 2023
In Theatres from 30th JUNE ✅@viraj_ashwin @starlingpayal @mee_suneel @simratkaur_16 @Raparthy @maguntasarath @THARAK369#MayaPetikaOnJune30 pic.twitter.com/uV7dNA1WDD