Masooda OTT Release: ‘మసూద’ మీ ఇంటికే వచ్చేస్తుంది, స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
తెలుగులో ఇటీవల విడుదలైన హార్రర్ సినిమా ‘మసూద’. చిన్న సినిమాగా థియేటర్ లో విడుదలైన ఈ చిత్రం తర్వాత పాజిటివ్ టాక్ ను తెచ్చుకొన్ని మంచి వసూళ్లు సాధించి ఈ యేడాది క్లీన్ హిట్ చిత్రాల లిస్ట్ లోకి ఎక్కింది.
‘మసూద’.. చిన్న సినిమాగా థియేటర్ లో విడుదలైన ఈ చిత్రం.. ఆ తర్వాత పాజిటివ్ టాక్ ను తెచ్చుకొన్ని మంచి వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ యేడాది క్లీన్ హిట్ చిత్రాల లిస్ట్ లోకి ఎక్కింది. సీనియర్ నటి సంగీత ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పక్కా హార్రర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను భయపెట్టింది. ఈ సినిమాలో తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే హిట్ సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమాను రాహుల్ యాదవ్ నక్కా రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే ‘మసూద’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ఈ మధ్య కాలంలో థియేటర్ లో సినిమాలు ఎక్కువ రోజులు ఆడట్లేదు. ఇక చిన్న సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావడం కూడా తగ్గించారనే చెప్పొచ్చు. సినిమా బాగుంది అని టాక్ వస్తేనే థియేటర్ కు వెళ్తున్నారు. పెద్ద సినిమాలు అయితే నాలుగు వారాలు చిన్న సినిమాలు అయితే రెండు వారాలకు మించి థియేటర్లలో రన్ కావడం లేదు. ఓటీటీలు వచ్చిన తర్వాత చిన్న సినిమాలు ఓటీటీలోనే ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. ‘మసూద’ సినిమా బాగుందని టాక్ వచ్చినా చాలా మంది థియేటర్ కు వెళ్లలేదు. ఓటీటీ లో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా కోసం ఎదురు చూస్తోన్న ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ‘మసూద’ సినిమా డిసెంబర్ 21 నుంచి ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.
View this post on Instagram
‘మసూద’ నవంబర్ 18న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయిందీ మూవీ. ఇటీవల కాలంలో హార్రర్ సినిమాలు అంటే అందులో ఫన్ ఎలిమెంట్ ను కూడా మిక్స్ చేస్తున్నారు. అలాంటి సినిమాల్లో ఒకటో రెండో హిట్ అవుతున్నాయి. మిగతా సినిమాలు రొటీన్ గా మారుతున్నాయి. ఆ విషయంలో ‘మసూద’ దర్శకుడు చాలా కేర్ తీసుకున్నాడనే చెప్పాలి. ఈ మధ్య వచ్చిన హార్రర్ కామెడీ సినిమాల్లా కాకుండా పూర్తిగా కథతో నడుస్తుంది సినిమా. మూవీలో సంగీత నటనకి మంచి మార్కులే పడ్డాయి. మదర్ సెంటిమెంట్ ని పండించడంలో ఆమె సక్సెస్ అయ్యింది. దెయ్యం పట్టిన కూతురు వింత ప్రవర్తనకి భయపడటం, అలాగే తిరువీర్ తో కలసి కూతుర్ని కాపాడటానికి ఆమె చేసిన సాహసాలు ప్రేక్షకులని మెప్పంచాయి. మూవీ లో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించినా ఆద్యంతం భయం కలిగించేలా సాగుతుంది. చివరి అరగంట సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు రావడం చాలా అరుదు. అందుకే ఈ సినిమాను ప్రేక్షకులు అంతగా ఆదరించారు. మరి ఈ ‘మసూద’కు డిజిటల్ వేదికపై ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
Read Also: బాలీవుడ్ సినిమాల పతనానికి కారణం వాళ్లే, దర్శకుడు రాజమౌళి సంచనల వ్యాఖ్యలు