అన్వేషించండి

Mangalavaram: ‘మంగళవారం’ టీజర్ - ఆ ఊరి ప్రజలకు ఆకాశంలో ఏం కనిపించింది? హాట్ సీన్స్‌లో పాయల్!

‘మంగళవారం’ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ను అందించారు మేకర్స్. మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. 

Mangalavaram: దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తోన్న మూవీ ‘మంగళవారం’. ‘ఆర్ఎక్స్100’ లో హీరోయిన్ గా నటించి తన గ్లామర్ తో అందరి దృష్టినీ ఆకర్షించిన పాయల్ రాజ్ పుత్ ఈ మూవీలో లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ మూవీతో మరోసారి అజయ్ భూపతి డైరెక్షన్ లో నటిస్తోంది బ్యూటీ. ఇప్పటికే ‘మంగళవారం’ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ను అందించారు మేకర్స్. మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. 

ఉత్కంఠ రేపుతోన్న ‘మంగళవారం’ టీజర్..

‘మంగళవారం’ టీజర్ విషయానికొస్తే.. టీజర్ మొత్తం థ్రిల్లర్ సస్పెన్స్ అంశాలతో నింపేశారు దర్శకుడు. ఇది పల్లెటూరి బ్యాగ్రౌండ్ లో జరిగే కథలా అనిపిస్తోంది. టీజర్ ప్రారంభంలో అరటితోటలో ఓ జంట చనిపోయి ఉన్నట్టు చూపించారు. అక్కడే పైన ఆకాశంలో సీతాకోకచిలుకలు గుంపుగా తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. తర్వాత ఓ అమ్మవారి ఆలయాన్ని చూపించారు. టీజర్ ప్రతీ షాట్ లో కూడా సినిమాలో పాత్రల కళ్లనే హైలెట్ చేస్తూ చూపించారు. ఊరి ప్రజలంతా ఆకాశం వైపు భయంతో చూడటం చూపించారు. తర్వాత పాయల్ రాజ్ పుత్ ను కొన్ని బోల్డ్ సీన్స్ లో చూపిస్తూ తర్వాత ఆమె బిగ్గరగా అరుస్తున్నట్టు ఎమోషన్స్ సీన్స్ లోనూ చూపించారు. టీజర్ లో ఓ వ్యక్తి అమ్మవారి రూపంలో ఉన్న ఫేస్ మాస్క్ ను తీసుకుంటున్నట్టు చూపించారు. టీజర్ అంతా చాలా ఉత్కంఠగా సాగిందనే చెప్పాలి. మూవీలో పాయల్ రాజ్ పుత్ పాత్ర ఏంటి? ఆ ఊరి జనాలు ఆకాశంవైపు ఎందుకు చూస్తున్నారు? ఇంతకీ ఆ మాస్క్ ధరించేది ఎవరు, ఎందుకు ధరిస్తున్నారు? సినిమాలో సీతాకోకచిలుకల కథ ఏంటి? వంటి సస్పెన్స్ అంశాలతో చాలా ఉత్కంఠగా కట్ చేశారు టీజర్. 

టీజర్ రిలీజ్ తో మారిపోయిన అంచనాలు..

పాయల్ రాజ్ పుత్ ను ఇన్ని రోజులూ గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా చేశాం. ‘ఆర్ఎక్స్100’ సినిమా నుంచి అంతే. అయితే ఆ సినిమా దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లోనే ఈ మూవీ కూడా రావడం, మూవీ ప్రచార చిత్రాల్లో పాయల్ ను బోల్డ్ గా చూపించడంతో ఈ సినిమాలో కూడా ఏదో బోల్డ్ కంటెంట్ ను ఉంటుందని అనుకున్నారంతా. అయితే మూవీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీపై ఉన్న ఫీలింగ్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. ఓ పల్లెటూరిలో సాగే హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఎంతో ఉత్కంఠగా సాగింది టీజర్. దీంతో మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ అంతా ఓ డార్క్ మోడ్ లో హై అండ్ సస్పెన్స్ సీన్స్ తో నిండిపోయింది. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంది. మొత్తంగా టీజర్ తో మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

Also Read: ఓవైపు పవన్ మూవీ, మరోవైపు బన్నీ సినిమా - మహేష్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న గురూజీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget