Manchu Manoj: నా జీవితంలో మరో దశలోకి ప్రవేశిస్తున్నా - మంచు మనోజ్ గుడ్ న్యూస్
మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ మరో రెండు రోజుల్లో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు ప్రటించాడు. ఇంతకీ అతడు చెప్పనున్నది పెళ్లి గురించా? కొత్త ప్రాజెక్ట్ గురించా?
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుమారుడు మనోజ్ కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, మనోజ్ వైవాహిక జీవితంలోనూ ఒడిదుడుకులకు లోనయ్యాడు. సోషల్ మీడియాలో మాత్రమే యాక్టీవ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు. మనోజ్ తాజాగా పోస్ట్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయంగా మారింది. మరో రెండు రోజుల్లో అతడు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు వెల్లడించాడు. దీంతో మనోజ్.. తన రీ-ఎంట్రీ మూవీ ‘అహం బ్రహ్మాస్మీ’ లేదా మరో కొత్త సినిమా గురించి చెప్పనున్నాడా? లేదా రెండో పెళ్లి గురించి ప్రకటిస్తాడా అనే ఉత్కంఠ నెలకొంది.
మంచు మనోజ్ 2004లో ‘దొంగ దొంగది’ మూవీ ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘శ్రీ’, ‘రాజుభాయ్’, ‘నేను మీకు తెలుసా’ వంటి భిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఆ సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. చివరికి 2010లో విడుదలైన ‘బిందాస్’, ‘వేదం’ సినిమాలతో సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ‘బిందాస్’ సినిమాకు నందీ అవార్డును సైతం అందుకున్నాడు. 2018లో ‘అపరేషన్ 2019’ మూవీ తర్వాత మళ్లీ మనోజ్ సినిమాలకు సైన్ చేయలేదు. 2015లో తన గర్ల్‌ఫ్రెండ్ ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న మనోజ్.. 2019లో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి మనోజ్ ఒంటరిగానే ఉంటున్నారు. సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నాడు.
జనవరి 20న గుడ్ న్యూస్?
It’s been a while, i’ve been holding this special news close to my heart ❤️
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 18, 2023
Excited to enter into the next phase of my life.. :)
Announcing on 20th Jan 2023 🤗
Need all your blessing as always :))) pic.twitter.com/bKRnwKT0oc
మంచు మనోజ్ తాజా ట్వీట్‌ను చూస్తే.. తప్పకుండా రెండో పెళ్లి గురించే అని తెలుస్తోంది. ‘‘ఈ ప్రత్యేకమైన సమాచారాన్ని చాలా కాలంగా నా గుండెల్లోనే ఉంచుకున్నాను. నా జీవితంలోని తదుపరి దశలోకి ప్రవేశించబోతున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దీని గురించి జనవరి 20న ప్రకటిస్తాను. ఎప్పటిలాగే మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో మనోజ్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అదేంటో తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే. ట్వీట్టర్‌లో మనోజ్ ‘దొంగ దొంగది’ పాటను జిఫ్ ఫైల్‌ను పోస్ట్ చేయగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఓ సింహం కళ్లజోడు పెట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశాడు. దీంతో పెళ్లి గురించా? లేదా కొత్త ప్రాజెక్టు గురించా అనే గందరగోళం నెలకొంది.
View this post on Instagram