By: ABP Desam | Updated at : 20 Jan 2023 11:14 AM (IST)
మంచు మనోజ్ కొత్త సినిమా 'వాట్ ద ఫిష్' కాన్సెప్ట్ పోస్టర్
కథానాయకుడిగా మంచు మనోజ్ (Manchu Manoj) పంథా ఎప్పుడూ వైవిధ్యమే. ఓ జానర్, ఓ తరహా సినిమాలకు పరిమితం కాకుండా ముందు నుంచి ప్రయోగాలు చేస్తూ రావడం ఆయనకు అలవాటు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా తన కంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు మనోజ్. అయితే, గత కొన్నాళ్ళుగా ఆయన నుంచి సినిమాలు రాలేదు.
ఇటీవల సినిమా వార్తలతో కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో మంచు మనోజ్ నలుగురు నోళ్ళలో పడ్డారు. అందువల్ల, ఆయన స్పెషల్ న్యూస్ చెబుతానని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే... చాలా మంది పెళ్ళి గురించి క్లారిటీ ఇస్తారని భావించారు. అయితే... ఆ స్పెషల్ న్యూస్ పెళ్ళి గురించి కాదు! కొత్త సినిమా గురించి! ఈ రోజు మంచు మనోజ్ ఓ సినిమా అనౌన్స్ చేశారు. అదే స్పెషల్ న్యూస్ అన్నమాట!
వాట్ ద ఫిష్?
మంచు మనోజ్ కథానాయకుడిగా నటించనున్న సినిమా 'వాట్ ద ఫిష్'. మనం మనం బరంపురం... అనేది ఉపశీర్షిక. ఈ రోజు సినిమా అనౌన్స్ చేయడంతో పాటు టైటిల్ వెల్లడించారు. అలాగే, కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. సుమారు ఆరేళ్ళ విరామం తర్వాత మనోజ్ నటిస్తున్న చిత్రమిది.
It's been a long time since I did any film but I’m blessed to have had all your love upon me all these years and it’s high time to give back all the Love ❤️
Here’s Announcing my NEXT❤️🚀 #WhatTheFish 🤪🥸🤩🥳😎💫
A crazy film that’ll give you all a CRAZYYYYY experience :) pic.twitter.com/tUx7SofoRu — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 20, 2023
ఓస్... పెళ్ళి కాదా!?
పెళ్ళి గురించి మనోజ్ చెబుతాడని ఎదురు చూసిన ప్రేక్షకులు 'ఓస్... పెళ్ళి కాదా?' అని పోస్టులు చేశారు. ఒకరిద్దరు 'ఐ థింక్ వాటో వాటు' (మేం ఇంకేదో అనుకున్నాం) అని రిప్లైలు ఇచ్చారు.
దర్శకుడికి ఇదే తొలి సినిమా!
'వాట్ ద ఫిష్' సినిమాకు వరుణ్ కోరుకొండ దర్శకుడు. ఆయనకు ఇదే తొలి సినిమా. డైరెక్షన్ కాకుండా కథ కూడా అందిస్తున్నారు. 6ఐఎక్స్ (సిక్స్) సినిమాస్, ఎ ఫిల్మ్ బై వి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తికరంగా డిజైన్ చేశారు.
ఓ అమ్మాయి గూగుల్ మాస్క్ పెట్టుకున్న క్యారికేచర్ పోస్టర్ టాప్ లో కనబడుతోంది. హీరో వెనుక నుంచి తీసిన ఫోటో చూపించారు. బాగా గడ్డాలు పెంచుకుని కార్ల మీద వస్తున్న విలన్లు, ముందు వింటేజ్ కార్ చూస్తే... స్టైలిష్ ఎంటర్టైనర్ అనే ఫీలింగ్ కలిగింది.
డార్క్ కామెడీ... థ్రిల్లింగ్!
డార్క్ కామెడీ అండ్ హై వోల్టేజ్ థ్రిల్లర్, అడ్వెంచరస్ సినిమా 'వాట్ డా ఫిష్' అని దర్శకుడు వరుణ్ తెలిపారు. షూటింగులో మంచు మనోజ్ పాజిటివ్ ఎనర్జీ తమకు ఎంతో బూస్ట్ ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ ఎనర్జీని ప్రేక్షకులకు త్వరగా చూపించాలని అనుకుంటున్నట్టు వివరించారు.
75 రోజులు టొరంటో, కెనడాలో!
సుమారు 75 రోజుల పాటు టొరంటో, కెనడాలో తెలుగు నటీనటులతో పాటు ఫారిన్ కాస్ట్ అండ్ క్రూతో 'వాట్ ద ఫిష్' షూటింగ్ చేయనున్నారు. వాళ్ళ వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని నిర్మాణ సంస్థలు తెలిపాయి. ఇది మంచు మనోజ్ పాన్ ఇండియా సినిమా.
Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే?
హీరోగా మనోజ్ నటించిన పూర్తి స్థాయి సినిమా అంటే 'గుంటూరోడు' అని చెప్పాలి. 'ఒక్కడు మిగిలాడు' సినిమాలో కూడా ఆయనది స్పెషల్ రోల్. ఆ తర్వాత 'ఇది నా లవ్ స్టోరీ', 'ఆపరేషన్ 2019'లో అతిథి పాత్రల్లో మెరిశారు. 'గుంటూరోడు' విడుదలై దాదాపు ఆరేళ్ళు కావొస్తోంది. మధ్యలో 'అహం బ్రహ్మాస్మి' సినిమా ప్రకటించారు. ఆ సినిమా పక్కన పెట్టినట్టు ఉన్నారు.
Also Read : 'ఏటీఎం' వెబ్ సిరీస్ రివ్యూ : వీజే సన్నీ దొంగతనం సక్సెసా? ఫెయిలా?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Gruhalakshmi February 3rd: ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయేందుకు అభి ప్లాన్- నందు వ్యాపారానికి లాస్య కండిషన్
Guppedantha Manasu February 3rd Update: రాజీవ్ అరెస్ట్ తో రిషికి నిజం తెలిసిపోయింది, తనెవరో తెలియాలన్న రిషికి ఫజిల్ వదిలేసిన వసు!
Ennenno Janmalabandham February 3rd: యష్, వేద క్యూట్ రొమాన్స్- పెళ్లి చేసుకుంటానని మాళవికకి మాటిచ్చిన అభిమన్యు
K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక