అన్వేషించండి

Manchu Manoj Game Show: మంచు మనోజ్ ‘ఉస్తాద్‌’ గేమ్‌ షో షురూ, తొలి ఎపిసోడ్‌లో నాని సందడి!

Manchu Manoj Game Show: మంచు మనోజ్‌ హోస్ట్‌ గా వస్తున్న సెలబ్రిటీ గేమ్‌ షో ‘ఉస్తాద్‍’. ఈటీవీ విన్‌ ఓటీటీ వేదికగా ఈ నెల 15 నుంచి ప్రసారం కానుంది. తాజాగా ఈ షో తొలి ఎపిసోడ్ ప్రోమో విడుదల అయ్యింది.

Manchu Manoj Ustaad Game Show: యంగ్ హీరో మంచు మనోజ్‌ సరికొత్త గేమ్ షోతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఆయన హోస్ట్ గా ‘ఉస్తాద్‍’ పేరుతో సెలబ్రిటీ గేమ్ షో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ ప్రతిష్టాత్మక గేమ్ షోను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ గేమ్ షో తొలి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.

తొలి ఎపిసోడ్ లో నాని సందడి

‘ఉస్తాద్‍’ ర్యాంప్‍ ఆడిద్దాం గేమ్ షోకు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ తో ఆయన కలిసి చేసిన అల్లరి ప్రేక్షకులను బాగా అలరించింది. ఫన్నీ ముచ్చట్లు, పవర్ ఫుల్ డైలాగులు, దుమ్మురేపే డ్యాన్సులు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. నాని నటించి ‘హాయ్ నాన్న’ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఆయన ఈ షోలో పాల్గొన్నారు. నానితో పాటు మరో అతిథి కూడా ఈ షోలో పాల్గొన్నది. ఆమె ఎవరో సెలబ్రిటీ కాదు, నాని వీరాభిమాని శ్రీ ప్రియ. ‘ఉస్తాద్’ షోలో పాల్గొని నానితో కలిసి గేమ్ ఆడింది. ఇక తన అభిమాని గురించి నాని చాలా గొప్పగా చెప్పారు. “ఈమె నాకంటే ఫేమస్.. తన పేరు శ్రీ ప్రియ. ఇప్పటి వరకు ఆమె నాకు అభిమాని, ఇకపై నేను ఆమెకు అభిమానిని’ అని చెప్పుకొచ్చారు. ఈ ప్రోమోలో నాని, శ్రీ ప్రియ కలిసి గేమ్ ఆడుతున్న సన్నివేశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.  ఇంతకీ ఈమె గేమ్ లో ద్వారా ఎంత అమౌంట్ ను తీసుకెళ్లింది? అనేది డిసెంబర్ 15న తెలియనుంది. ఇప్పటికే ఈ షో గురించి మంచు మనోజ్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ షో ఒక్కో ఎపిసోడ్ కి రూ.50 లక్షలు ప్రైజ్ మనీ ఉంటుందన్నారు. తొలి ఎపిసోడ్ లో నాని గెలుచుకున్న అమౌంట్ మాత్రం తన అభిమానికి వెళ్తుందని చెప్పారు.

తొలి సీజన్ గెస్టులు ఎవరంటే?

మరోవైపు ‘ఉస్తాద్’ గేమ్ షో తొలి సీజన్ లో మంచు ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ పాల్గొనడం లేదని తెలుస్తోంది. రెండో సీజన్ లో వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్. తొలి సీజన్ లో నేచురల్ స్టార్ నాని, మాస్ మహారాజ రవితేజ, అడవి శేష్ సహా మరికొంత మంది పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

రెండు సినిమాల్లో నటిస్తున్న మంచు మనోజ్     

మంచు మనోజ్ ‘ఉస్తాద్’ గేమ్ షోతో పాటు రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి ‘వాట్ ది ఫిష్’. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు ‘అహం బ్రహ్మస్మి’ అనే మరో సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు.  2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత మంచు మనోజ్ మళ్లీ తెరమీద కనిపించలేదు.

Read Also: హ్యాపీ బర్త్ డే వెంకటేష్ - వెంకీమామ మన అందరివాడు, ఈ ప్రత్యేకతలు ఆయనకే సొంతం

టాప్ హెడ్ లైన్స్

Governor OTT : ఓటీటీలోకి వచ్చేసిన మనోజ్ బాజ్‌పాయ్ కొత్త మూవీ - నేషనల్ అవార్డ్ విన్నర్ పొలిటికల్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన మనోజ్ బాజ్‌పాయ్ కొత్త మూవీ - నేషనల్ అవార్డ్ విన్నర్ పొలిటికల్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Godavari Serial Today July 24th: 'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
Kotha Soku Lyrics: కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
Ramayana Trailer : రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా - అసలు రీజన్ ఏంటో చెప్పిన ప్రొడ్యూసర్
రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా - అసలు రీజన్ ఏంటో చెప్పిన ప్రొడ్యూసర్

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget