Mamta Mohan Das: ఇక ఆపండి చాలు - క్యాన్సర్ వార్తలపై మమతా మోహన్ దాస్ ఫైర్
ఫేక్ వార్తలను చాలా మంది సెలబ్రిటీలు లైట్ తీసుకున్నా.. కొంతమంది మాత్రం వాటిని ఖండిస్తున్నారు. తాజాగా నటి, ప్లే బ్యాక్ సింగర్ మమతా మోహన్ దాస్ సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వార్తలను ఖండించింది.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా గురించి తెలియనివాళ్ళు ఎవరూ ఉండరు. స్మార్ట్ ఫోన్ లు వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్రభావం ఇంకా ఎక్కువైంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అయితే వాస్తవాలతో పాటు ఫేక్ వార్తలు, పుకార్లు కూడా సోషల్ మీడియాలో ఎక్కవగా కనిపిస్తూ ఉంటాయి. ఇక సినీ ఇండస్ట్రీ గురించి, సెలబ్రెటీల వ్యక్తిగత, వైవాహిక జీవితాల గురించి వచ్చే పుకార్లు గురించైతే.. చెప్పక్కర్లేదు. ఫేక్ వార్తలను చాలా మంది సెలబ్రిటీలు లైట్ తీసుకున్నా.. కొంతమంది మాత్రం వాటిని ఖండిస్తున్నారు. తాజాగా నటి, ప్లే బ్యాక్ సింగర్ మమతా మోహన్ దాస్ సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వార్తలను ఖండించింది.
గత కొన్ని రోజులుగా చాలా మంది హీరోయిన్ లు క్యాన్సర్ బారిన పడ్డారని వరుసగా వార్తలు వస్తున్నాయి. ఇదే కోవలో నటి మమతా మోహన్ దాస్ కూడా క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు వార్తలు వచ్చాయి. చాలా వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ మమతాపై వార్తలను వండి వార్చేశాయి. మమతా మోహన్ దాస్ 2009లో హాడ్కిన్ లింఫోమో అనే ఒక రకమైన క్యాన్సర్ వ్యాధికి గురైంది. ఏడేళ్ల పాటు ఆమె క్యాన్సర్ తో పోరాడింది. ఎట్టకేలకు ఆమె క్యాన్సర్‌ను జయించి.. ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతోంది. మళ్లీ సినిమాలతో బిజీగా మారిపోయింది.
అయితే, మమతా మోహన్ దాస్‌కు మళ్లీ క్యాన్సర్ తిరగబడిందని, ఈసారి మరింత ప్రమాకరంగా మారిందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో మమతా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆ వార్తలపై స్పందించింది. అవన్నీ ఫేక్ వార్తలను కొట్టపడేసింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఘాటుగా సమాధానమిచ్చింది. తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాను అని వెల్లడించింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మమతా క్యాన్సర్‌కు గురైనట్లు వార్తలు రావడంతో ఆమె సన్నిహితులు, అభిమానుల నుంచి మెసేజ్‌లు, మెయిల్స్, కాల్స్ వచ్చాయని మమతా తెలిపింది. యూట్యూబ్ ఛానెళ్లు ఇలా తప్పుడు ప్రచారం చేయడం తగదని మమతా మండిపడింది. ఇలాంటి వారికి బుద్ధి రావాలి అంటే నరకానికి పంపాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇకనైనా అలాంటి తప్పుడు ప్రచారాన్ని ఆపాలని కోరింది.
View this post on Instagram
ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన మమతా తర్వాత 'యమదొంగ' సినిమాతో నటిగా మారింది. తెలుగులో విక్టరీ, హోమం, చింతకాయల రవి, కింగ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఒక్క తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ, తమిళ్ సినిమాల్లో కూడా నటించింది.