అన్వేషించండి

Revathy Sampath: అర్థరాత్రి ఫోన్ చేసి నాతో పడుకుంటావా అన్నాడు.. ‘తులసి’ నటుడు రియాజ్‌పై నటి రేవతి ఆరోపణలు

మలయాళీ నటి రేవతి సంపత్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పటికే సిద్ధిక్ పై అత్యాచార ఆరోపణలు చేసిన ఆమె, ఇప్పుడు నటుడు రియాజ్ ఖాన్ పైనా షాకింగ్ కామెంట్స్ చేసింది.

Revathy Sampath On Riyaz Khan: మలయాళీ సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు తర్వాత మహిళా నటులు బయటకు వచ్చి తమకు ఎదురైన వేధింపుల గురించి చెప్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు సిద్ధిక్ పై లైంగిక ఆరోపణలు చేసిన మలయాళీ నటి రేవతి సంపత్, ఇప్పుడు మరో నటుడుపై తీవ్ర ఆరోపణలు చేసింది. నటుడు రియాజ్ ఖాన్ కూడా తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. అర్థరాత్రి తనకు ఫోన్ చేసి పడుకుంటావా? అని అడిగాడని వెల్లడించింది.

రియాజ్ గురించి రేవతి షాకింగ్ కామెంట్స్

సిద్ధిక్ పై లైంగిక ఆరోపణలు చేసిన తర్వాతరేవతి ఓ మలయాళీ మీడియా సంస్థతో మాట్లాడింది. ఈ సందర్భంగా రియాజ్ ఖాన్ తనను ఎలా వేధించాడో వివరించే ప్రయత్నం చేసింది. రియాజ్ ఖాన్ ఫోన్ చేసి, తనతో పడుకుంటావా? అని అడగడంతో పాటు ఎవరైనా అమ్మాయిలు ఉంటే పంపించాలని కోరాడని చెప్పింది. “ఇటీవల ఒక నటుడు చెప్పిన 'అడిచి కేరి వా' డైలాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఆ నటుడి నుంచి ఓ రోజు అర్ధరాత్రి  ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఫోటోగ్రాఫర్ నా అనుమతి లేకుండా నా ఫోన్ నంబర్‌ ను అతడికి ఇచ్చాడు. ఫోన్ లో సెక్స్ వల్ విషయాలు మాట్లాడాడు. నాతో పడుకోవడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందా? అని అడిగాడు. నీకు ఇష్టమైన పొజిషన్ ఏంటో చెప్పాలన్నాడు. ఈ సంఘటన నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు జరిగింది. అతడి మాటలు విని నేను షాక్ అయ్యాను. ఆ ఫోన్ కాల్ లో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదని తనకు అర్థం అయ్యింది. మరో 9 రోజులు తాను కొచ్చిలోనే ఉంటాను. ఎవరైనా అమ్మాయిలు ఉంటే పంపించాలని కోరాడు” అని రేవతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రియాజ్ ఖాన్ వ్యవహారం మలయాళీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

తెలుగులోనూ పలు సినిమాలు చేసిన రియాజ్

నటుడు రియాజ్ తెలుగులోనూ పలు సినిమాలు చేశాడు. 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘దొంగలు’, ‘శివ శంకర్’, ‘గురు’, ‘నాయకుడు’, ‘నాయుడమ్మ’, ‘స్టాలిన్’, ‘రాజాబాబు’, ‘తులసి’, ‘కారా మజాకా’, ‘www’, ‘అలా ఇలా ఎలా’ అనే సినిమాల్లో నటించాడు.

పదవికి రాజీనామా చేసిన సిద్ధిక్

రీసెంట్ గా మలయాళ నటుడు సిద్ధిక్‌పై రేవతి లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్ ను సంస్థ అధ్యక్షుడు మోహన్ లాల్ కు అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం తన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పదవిలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నిజానికి రేవతి 2019లోనే సిద్ధిక్ గురించి చాలా విషయాలు చెప్పింది. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి తనకు ఎదురైన వేధింపుల గురించి వివరించింది. సిద్ధిక్ లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, అతడిని ఇండస్ట్రీ నుంచి నిషేధించాలని ఆమె డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు మలయాళీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.    

Read Also: ఆ నటుడు నన్ను వెనుక నుంచి వాటేసుకున్నాడు, మరొకరు రూమ్‌కు పిలిచి..: నటి మిను మునీర్

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget