Malaika Arora: అర్బాజ్‌తో అందుకే విడిపోయా - అర్జున్‌తో రిలేషన్ ట్రోల్స్ పట్టించుకోను: మలైకా అరోరా
అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుదోంది మలైకా అరోరా. భర్త అర్బాజ్ ఖాన్ తో విడిపోయిన తర్వాత, అర్జున్ తో రిలేషన్ కొనసాగిస్తోంది. తాజాగా తన ప్రేమ సహా పలు విషయాల గురించి వివరించింది.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన ‘దిల్ సే’ సినిమాలో ‘చల్ ఛయ్యా ఛయ్యా’ పాటలతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మలైకా అరోరా. బీటౌన్ లో ఐటెమ్ సాంగ్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. తెలుగులో ఆడియెన్స్ నూ బాగానే అలరించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘కెవ్వు కేకా’ అంటూ కితకితలు పెట్టించింది. కొంతకాలం కిందటే తన 17 ఏళ్ల వివాహ జీవితానికి మలైకా ఫుల్ స్టాప్ పెట్టింది. భర్త అర్బాజ్ ఖాన్ తో విడిపోయింది.
అర్బాజ్ తో వేరయ్యాక, యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ కొనసాగిస్తోంది. వెకేషన్లు, పార్టీలు, పబ్బులు అంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి కాకుండానే ఈ అమ్మడు ప్రెగ్నెంట్ అయ్యిందని తాజాగా వార్తలు వచ్చాయి. వీటిని అర్జున్ కొట్టిపారేశాడు. ఈ నేపథ్యంలోనే తన ‘మూవింగ్ ఇన్ విత్ మలైకా షో’కు సంబంధించిన తొలి ఎపిసోడ్ ఓటీటీ వేదికగా టెలీకాస్ట్ అయ్యింది. ఇందులో అర్జున్ కపూర్ తో ప్రేమాయాణం, తమ ప్యూచర్ ప్లాన్స్, అర్బాజ్ తో విడిపోవడానికి గల కారణాల గురించి మలైకా వివరించింది.
అర్జున్ తో హ్యాపీగా ఉన్నా!
మలైకా టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ లో ప్రముఖ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ గెస్ట్ గా పాల్గొంది. ఈ సందర్భంగా మలైకాను ఫరా కొన్ని ప్రశ్నలు అడిగింది. అర్జున్ కపూర్ తో పెళ్లి చేసుకుని, పిల్లలు కనే ఆలోచన ఉందా? అని క్వశ్చన్ చేసింది. దీనికి మలైకా సమాధానం చెప్పింది. అర్జున్ తో ప్రస్తుతం హ్యాపీగా ఉన్నట్లు చెప్పింది. ఫ్యూచర్ గురించి ఇప్పుడే ఫ్లాన్స్ ఏమీ చేసుకోలేదని వెల్లడించింది. తమ ప్రేమ గురించి ఎవరు ఏమీ అనుకున్నా పట్టించుకోనని చెప్పింది.
అర్బాజ్ నన్ను ఓ వ్యక్తిలా మార్చాడు!
అర్బాజ్ తో విడిపోవడానికి గల కారణాలను కూడా వివరించింది. ఒకరికొకరు పూర్తి భిన్నమైన విషయాలను ఎంచుకోవడం మూలంగానే విడిపోవాల్సి వచ్చిందని తెలిపింది. అయితే, తాను ఎప్పటికీ అర్బాజ్ ను నిందించే పని చేయనని చెప్పింది. “వాస్తవానికి అర్బాజ్ నన్ను ఓ వ్యక్తిగా మార్చాడు. అతడి మూలంగానే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. నేను కూడా కొన్ని తనకు భిన్నమైన విషయాలు కావాలని కోరుకున్నా. అప్పుడే తన జీవితం కాస్త ట్రాక్ తప్పినట్లు ఫీలయ్యా. అయినా జీవితం ముందుకు సాగాలి కాబట్టే కొన్ని బంధాలను వదులుకోవాలి అనుకున్నా. అలా వదులుకుంటేనే సంతోషంగా ఉంటాననుకున్నా. అందుకే అర్బాజ్ తో విడిపోయా” అని చెప్పింది.
ట్రోలింగ్ కు అలవాటు పడిపోయా!
తనపై వచ్చే ట్రోలింగ్ గురించి కూడా మలైకా స్పందించింది. తన గురించి నెట్టింట్లో జరిగే ట్రోలింగ్ కు అలవాటు పడిపోయినట్లు చెప్పింది. సమాజంలో మనుషుల తీరు రెండు రకాలుగా ఉంటుందని చెప్పింది. మగవారు తనకంటే 20, 30 ఏండ్లు చిన్నవారైన అమ్మాయిలను ప్రేమిస్తున్నా పట్టించుకోరని, అదే స్త్రీ తనకంటే చిన్న వాడితో ప్రేమలో ఉంటే చులకనగా చూస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. సమాజం తమ గురించి ఏమనుకున్నా పట్టించుకోనని చెప్పింది. తన కుటుంబం, స్నేహితులు, అర్జున్ కపూర్ తో నా సంబంధం పట్ల సంతోషంగా ఉన్నారని చెప్పింది. మలైకా ప్రస్తుతం పలు ఓటీటీ వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
Read Also: ఇన్నాళ్లూ ఓపిక పట్టాను, ఇక యాక్షనే - అనసూయ వార్నింగ్