KGF Sequels: జేమ్స్ బాండ్ బాటలో ‘KGF’ సిరీస్, డిఫరెంట్ యాక్టర్స్‌తో 5 సీక్వెల్స్‌కు మేకర్స్ ప్లాన్!
‘KGF’ సీక్వెల్స్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. జేమ్స్ బాండ్ సిరీస్ లాగే ‘KGF’ సిరీస్ ను డిఫరెంట్ యాక్టర్స్ తో 5 సీక్వెల్స్ గా తెరకెక్కించాలని భావిస్తున్నారట.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘KGF’ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో ‘KGF’ ఒకటిగా నిలిచింది. ‘KGF’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ‘KGF2’ను తెరకెక్కించారు మేకర్స్. తొలి పార్ట్ తో పోల్చితే రెండో పార్ట్ అతిపెద్ద విజయాన్ని సొంత చేసుకుంది. రెండు భాగాలూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. ఈ అద్భుత యాక్షన్ ఫ్రాంచైజీలో మూడవ పార్ట్ లైన్‌లో ఉందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా వెలువడుతున్న సమాచారం ప్రకారం ‘KGF’కు 5 సీక్వెల్స్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.
బాండ్ సిరీస్ తరహాలో ‘KGF’ సిరీస్
తాజాగా నివేదికలను పరిశీలిస్తే ‘KGF’లో వరుసగా 5 సీక్వెల్స్ ఉండనున్నాయట. ఈ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ‘KGF’ను బాండ్ తరహా సిరీస్ గా రూపొందించేందుకు ప్రయత్నిస్తోందట. అయితే, ఈ సీక్వెల్స్ అన్నింటిలోనూ హీరోలు మారనున్నట్లు తెలుస్తోంది. డిఫరెంట్ యాక్టర్స్ తో ఈ సీక్వెల్స్ ఉండబోతున్నట్లు హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిర్గందూర్ వెల్లడించారు.
‘KGF5’ తర్వాతే కొత్త రాకీ భాయ్ వచ్చే అవకాశం!
విజయ్ కిర్గందూర్ తాజా ప్రకటనతో ‘KGF3’లో యష్ కనిపిస్తాడా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, ఈ ప్రాంచైజీలో 5వ భాగం తర్వాతే హీరోలు మారే అవకాశం ఉందని కొన్ని మీడియా పోర్టల్స్ రిపోర్ట్ చేశాయి. "’KGF’ ఫ్రాంచైజీలో 5వ భాగం తర్వాత, మరో హీరో రాకీ భాయ్ పాత్రను పోషించే అవకాశం ఉంది. జేమ్స్ బాండ్ సిరీస్ మాదిరిగానే, హీరోలు మారుతూ ఉంటారు" అని హోంబలే ఫిల్మ్స్ నిర్మాత ఓ మీడియా పోర్టల్‌తో వెల్లడించారు. ఈ నేపథ్యంలో వచ్చే 5 సీక్వెల్స్ లో యష్ హీరోగా కనిపించే అవకాశం ఉంది. ఇక ‘KGF3’ 2025లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.
‘KGF2’ విజయం తర్వాత బయట కనిపించని యష్
‘KGF2’ అద్భుత విజయం తర్వాత యష్ పెద్దగా బయట కనిపించడం లేదు. తాజాగా ఒకటి, రెండు యాడ్స్ లో నటించాడు. ‘KGF3’ షూటింగ్ 2025లో ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో ఇతర సినిమాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? అనే టాక్ నడుస్తున్నది. అయితే, చేయబోయేది పెద్ద ప్రాజెక్ట్ కావడంతో కొంతకాలం పాటు కుటుంబంతోనే గడపాలని రాకీ భాయ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ‘KGF’ 5 సీక్వెల్స్ తర్వాత రాబోయే రాకీ భాయ్ ఎవరై ఉండవచ్చు? అనే చర్చ నడుస్తోంది. అయితే, దానికి ఇంకా టైమ్ చాలా ఉందని, ఇప్పటి నుంచే అంచనా వేసే అవకాశం లేదని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram
View this post on Instagram
Read Also: ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్న శర్వానంద్, పెళ్లికూతురు ఎవరో తెలుసా?