Mahesh Babu Namrata Wedding Anniversary: భార్యకు మహేష్ పెళ్లి రోజు శుభాకాంక్షలు ఎలా చెప్పాడో చూశారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ పెళ్లి రోజు ఈ రోజే. ఈ సందర్భంగా భార్యకు మహేష్ పెళ్లి రోజు శుభాకాంక్షలు ఎలా చెప్పారో చూశారా?
ప్రేక్షకులకు మహేష్ బాబు పెద్ద హీరో. అభిమానులకు సూపర్ స్టార్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా పలువురు సినిమా ప్రముఖుల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. మహేష్ మాత్రం స్టార్ హీరోలా ఎప్పుడూ ప్రవర్తించరు. చాలా సింపుల్‌గా ఉంటారు. ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. ఇటీవల 'అన్‌స్టాపబుల్' షోలో 'మహేష్ ఎవరు?' అని బాలకృష్ణ అడిగితే... "ఫాదర్ టు మై చిల్డ్రన్" (నా పిల్లలకు తండ్రిని) అని సమాధానం ఇచ్చారు. ఈ రోజు భార్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన పోస్టులో కూడా అది కనిపించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ 17వ వివాహ వార్షికోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మహేష్ ఓ పోస్ట్ చేశారు. అందులో పిల్లలు గౌతమ్, సితార కూడా ఉన్నారు. "అప్పుడే 17 ఏళ్ళు. పెళ్లి రోజు శుభాకాంక్షలు ఎన్ఎస్‌జి (నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని అని)... ఇంకా మరెన్నో సంవత్సరాలకు! ఇట్స్ ఆల్ అబౌట్ లవ్" అని మహేష్ పేర్కొన్నారు.
View this post on Instagram
View this post on Instagram