News
News
X

Hey Sinamika Trailer: 'ఒకరితో ప్రేమ, మరొకరితో స్నేహం' యూత్ ఫుల్ కంటెంట్ తో 'హే సినామిక' ట్రైలర్

దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న 'హే సినామిక' సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. 

FOLLOW US: 

ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ 'హే సినామిక' అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా.. అదితి రావు హైదరి, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. మార్చి 4న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. మలయాళంలో మమ్ముట్టి ఈ ట్రైలర్ ను విడుదల చేయగా.. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. 

రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించారు. మౌన(అదితి రావు హైదరి) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు ఆర్యన్(దుల్కర్ సల్మాన్). ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. కానీ అతడి బిహేవియర్ తో విసిగిపోయిన మౌన విడాకులు తీసుకోవాలనుకుంటుంది. దీనికోసం తనతో కలిసి పని చేసే సాయం కోరుతుంది. ఫ్రెండ్స్ తో కూర్చొని భర్తపై జోకులేస్తుంటుంది మౌన. 

అదే సమయంలో ఆర్యన్ మరో అమ్మయితో స్నేహం చేస్తాడు. భర్త మరొకరితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేని మౌన తిరిగి అతడికి పొందాలనుకుంటుంది. కానీ ఫైనల్ గా హీరోకి లవ్, ఫ్రెండ్షిప్ రెండింటి మీద నమ్మకం పోతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా. ట్రైలర్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. చాలా క్లాసీగా సినిమాను రూపొందించారనిపిస్తుంది. 

జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి '96' ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు. రీసెంట్ గానే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. క్లీన్ 'యు' సర్టిఫికెట్ దక్కించుకుంది.

View this post on Instagram
 
A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

Published at : 16 Feb 2022 06:44 PM (IST) Tags: Mahesh Babu kajal aggarwal Aditi Rao Hydari Dulquer Salman Hey Sinamika Hey Sinamika trailer

సంబంధిత కథనాలు

Wakeup Dil Raju: మేలుకో దిల్ రాజు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ - మీమ్స్‌తో ఆడేసుకుంటున్న నెటిజన్స్!

Wakeup Dil Raju: మేలుకో దిల్ రాజు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ - మీమ్స్‌తో ఆడేసుకుంటున్న నెటిజన్స్!

Gruhalakshmi August 12th Update: సామ్రాట్ కౌగిట్లో తులసి, అది చూసి తలబాదుకుంటున్న నందు, లాస్యకు ఊహించని షాక్

Gruhalakshmi August 12th Update: సామ్రాట్ కౌగిట్లో తులసి, అది చూసి తలబాదుకుంటున్న నందు, లాస్యకు ఊహించని షాక్

Guppedantha Manasu ఆగస్టు 12 ఎపిసోడ్: లగ్నపత్రిక రాయించే వేడుకలో రిషి సాక్షికి షాకివ్వబోతున్నాడా, వసు ఎందుకంత కూల్ గా ఉంది!

Guppedantha Manasu ఆగస్టు 12 ఎపిసోడ్: లగ్నపత్రిక రాయించే వేడుకలో రిషి సాక్షికి షాకివ్వబోతున్నాడా, వసు ఎందుకంత కూల్ గా ఉంది!

Devatha August 12th Update: నాన్నని తీసుకొస్తానని దేవికి మాట ఇచ్చిన ఆదిత్య- చంపేస్తానంటూ మాధవకి వార్నింగ్ ఇచ్చిన ఆదిత్య

Devatha August 12th Update: నాన్నని తీసుకొస్తానని దేవికి మాట ఇచ్చిన ఆదిత్య- చంపేస్తానంటూ మాధవకి వార్నింగ్ ఇచ్చిన ఆదిత్య

Ennenno Janmalabandham August 12th Update: ఖైలాష్ మీద కేసు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్ళిన వేద - కానీ అంతలోనే..

Ennenno Janmalabandham August 12th Update: ఖైలాష్ మీద కేసు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్ళిన వేద -  కానీ అంతలోనే..

టాప్ స్టోరీస్

TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!

TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!

Nizamabad: పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్‌ హత్య - కర్రతో చావ బాదిన కొడుకు!

Nizamabad: పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్‌ హత్య - కర్రతో చావ బాదిన కొడుకు!

Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ

Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?