Mahesh Babu: పండుగాడు కొడితే దిమ్మతిరిగి బాక్సాఫీసు బద్దలైంది - 'పోకిరి' స్పెషల్ షోస్‌కు అదిరిపోయే కలెక్షన్స్
మహేష్ బాబు పుట్టిన రోజు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘పోకిరి’ సినిమాను రిలీజ్ చేశారు. చిత్రం ఏమిటంటే.. ఆ సినిమా అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లు సొంతం చేసుకుని రికార్డులు బద్దలకొట్టింది.
"ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో.. వాడే పండుగాడు" అంటూ పోకిరి సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్స్ ఎంతగా ఫేమస్సో మీకు తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది. పండుగాడు మరోసారి సెన్సేషన్ సృష్టించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు(ఆగస్టు 9) సందర్భంగా 'పోకిరి', 'ఒక్కడు' సినిమా స్పెషల్ షోస్ వేసిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో సైతం డబుల్ డిజిట్ నెంబర్స్ లో షోస్ ప్లాన్ చేశారు. టికెట్స్ బుకింగ్ మొదలైన కాసేపటిలోనే హాట్ కేకుల్లాగా అమ్ముడైపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మరోసారి తన క్రేజ్ చూపించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1.73 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
నైజాంలో రు.69 లక్షలు, గుంటూరులో రూ.13 లక్షలు, కృష్ణాలో రూ.10 లక్షలు, నెల్లూరులో రూ.4 లక్షలు, ఓవర్సెస్ లో రూ.17 లక్షలు, యూఎస్ లో రూ.24 లక్షలు వసూలు చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.1.73 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. స్పెషల్ షోకి ఇటువంటి వసూళ్లు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో సరికొత్త మహేష్ బాబుని చూపించారు. 2006లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీసు రికార్డులని బద్ధలు కొట్టింది. ఇందులో మహేష్ సరసన గోవా బ్యూటీ ఇలియానా నటించింది. మహేష్ బర్త్ డేకి పది రోజుల ముందే రాజమండ్రిలో ‘ఒక్కడు’ స్పెషల్ షో వేసి సంబరాలు మొదలుపెట్టారు. ఆ షోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏదో కొత్త సినిమా విడుదలైన తరహాలో హడావిడి చేశారు. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల్లో ఒక్కడు, పోకిరి షోస్ వేసి సూపర్ అనిపించారు.
యూట్యూబ్ లో ఈ సినిమా ఫ్రీగా చూసే అవకాశం ఉన్నప్పటికీ అభిమానులు థియేటర్ కి వచ్చి మహేష్ బాబు మీద ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ షోల ద్వారా వచ్చే డబ్బులన్నీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఖాతాల్లోకి వెళ్లవు. సినిమా రైట్స్ కోసం కొంత మొత్తం చెల్లించి, థియేటర్లకి అద్దెలు ఇచ్చి మిగిలిన డబ్బుని మహేష్ బాబు పేరుతో ఉన్న ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్స్ కి ఉపయోగించనున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మొత్తానికి తమ అభిమాన హీరో పుట్టినరోజుకు ఫ్యాన్స్ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వడంతో పాటు ట్రెండ్ సెట్ చేశారు.
Also Read : మాచర్ల నియోజకవర్గం రివ్యూ : నితిన్ సినిమా ఎలా ఉందంటే?
Also Read : కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?
#Pokiri special show in Solapur, Maharastra @urstrulymahesh 🔥🥵🙏pic.twitter.com/YgvkdItZpp
— MSC🔔 (@urstruly_msc) August 9, 2022