Mahesh Babu - Valentine Model: ప్రేమించడంలో సరిలేరు మహేష్ బాబుకెవ్వరు! లవ్ అంటే రోల్ మోడల్ సూపర్ స్టారే!
ప్రేమ... ఇష్క్... కాదల్... లవ్... భాష ఏదైనా భావం ఒక్కటే! మనసుతో ముడి పడి ఉన్నదే! ఈ రోజు ప్రేమికుల రోజు. ప్రేమకు రోల్ మోడల్ అంటే... సూపర్ స్టార్ మహేష్ బాబే! ఎందుకు అంటారా? అయితే... చదవండి.
ప్రేమ... ఇష్క్... కాదల్... లవ్...
భాష ఏదైనా దాని భావం ఒక్కటే!
సృష్టిలో ఎలాంటి పరిమితులు లేనిది ప్రేమ ఒక్కటే!
ఎప్పటికప్పుడు కొత్తగా అనుభూతినిచ్చేదీ ప్రేమ ఒక్కటే!
అందుకే, ప్రేమపై అన్ని సినిమాలు వస్తున్నాయి.
ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
వెండితెరపై చాలా మంది హీరోలు ప్రేమికులుగా నటించారు.
మరి, నిజ జీవితంలో ప్రేమకు రోల్ మోడల్ అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు?
ఇంకెవరు? సూపర్ స్టార్ మహేష్ బాబే అని చెప్పాలి! ఎందుకు? అంటే... ఓ లుక్ వేయండి!
ప్రేమ అంటే?
అమ్మాయి, అబ్బాయి మధ్యే ఉండాలా?
స్త్రీ - పురుషుల మధ్య మాత్రమే ప్రేమ ఉంటుందా?
భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది.
సోదర సోదరీమణుల మధ్య కూడా ప్రేమ ఉంటుంది.
తల్లిదండ్రులు - పిల్లల మధ్య కూడా ప్రేమ ఉంటుంది.
ప్రేమ అంటే కుటుంబం... కుటుంబ అంటే ప్రేమ!
కుటుంబం పట్ల ప్రేమను చూపించే విషయంలో మహేష్ రోల్ మోడల్ అని చెప్పాలి.
మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. ప్రేమ కోసం కొంత మంది పెద్దలను ఎదిరిస్తారు. సమాజంలో తమ కాళ్ళ మీద తాము నిలబడే స్థితికి వచ్చిన తర్వాత పెద్దలకు విలువ ఇవ్వరు. మహేష్ అలా చేయలేదు. నమ్రతతో ప్రేమ విషయాన్ని నేరుగా కృష్ణ దగ్గరకు వెళ్ళి చెప్పారు. తండ్రి అనుమతి తీసుకున్నారు. నమ్రత కూడా కృష్ణను కలిశారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. యువతకు ఆదర్శంగా నిలిచారు.
ప్రేమను భార్యకు మాత్రమే కాదు... పెళ్లి తర్వాత జీవితంలోకి వచ్చే పిల్లలకు, ఈ భూమ్మీదకు రావడానికి కారణమైన తల్లిదండ్రులకు కూడా పంచాలి. మహేష్ ఆ విషయంలో ఎప్పుడూ సూపరే. ఇటీవల బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' కార్యక్రమానికి వచ్చినప్పుడు 'మహేష్ ఎవరు?' అని ప్రశ్నిస్తే... 'నా పిల్లలకు తండ్రిని' అని చెప్పారు. పిల్లలు అంటే ఆయనకు ఎంత ప్రేమ అనేది ఆ మాటల్లో తెలిసింది. అదే షోలో తల్లి దగ్గర ఎప్పుడూ తాను పిల్లాడిననే విషయాన్ని చెప్పారు. స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు తల్లి చేతి కాఫీ తాగితే... ఆ స్ట్రెస్ పోతుందని, అందుకని సినిమా విడుదలకు ముందు అమ్మ దగ్గరకు వెళ్లి వస్తానని మహేష్ చెప్పారు. ఆ మాటల్లో తల్లి అంటే ఎంత గౌరవం, అనురాగం అనేది కనిపించింది. తండ్రి అంటే కూడా మహేష్ బాబుకు ఎంతో గౌరవం. అది మాటల్లో కాదు, ఎప్పుడూ చేతల్లో కనిపిస్తుంది. అన్నయ్య రమేష్ బాబు మీద ప్రేమతో ఆయన్ను నిర్మాత చేశారు మహేష్. సోదరి మంజులకు సినిమా చేశారు. నేనొక్కడినే, నా కుటుంబం ఒక్కటే అనుకోలేదు... తోబుట్టువులు అందరి మేలు కోసం ఆలోచించాడు.
కుటుంబ సభ్యుల కోసం మాత్రమే ఆలోచించలేదు... తనను ఇంతటివాడిని చేసిన అభిమానులు, ప్రేక్షకుల కోసం కూడా మహేష్ బాబు ఆలోచించారు. ఎంతో మందికి గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. ప్రేమను పంచుతున్నారు. అదీ మహేష్ బాబు అంటే! అందుకే, ఆయన నయా వాలంటైన్ రోల్ మోడల్. ప్రేమించడంలో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసిన స్టార్!