అన్వేషించండి

Mufasa: The Lion King: అక్కడ షారుఖ్, ఇక్కడ మహేష్ ఫ్యామిలీ- ఐకానిక్ క్యారెక్టర్ కు సూపర్ స్టార్ వాయిస్! డిస్నీ ప్రయత్నాలు ఫలించేనా?

Tollywood News | మహేష్ బాబు ‘ముఫాసా: ది లయన్ కింగ్‌’లో భాగం కాబోతున్నారు. ముఫాసా క్యారెక్టర్ కు ఆయన తెలుగులో వాయిస్ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు డిస్నీ సంస్థ ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Mahesh Babu In Talks To Be A Part Of Mufasa: The Lion King: తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నమహేష్ బాబు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నారు. ‘ముఫాసా: ది లయన్ కింగ్‌’లో ముఫాసా క్యారెక్టర్ కు వాయిస్ ఇవ్వబోతున్నారు.  డిసెంబర్ 20న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రం కోసం హాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ ప్రపంచం అంతా ఆసక్తిక ఎదురుచూస్తోంది. ఇంగ్లీష్ తో పాటు భారత్ లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్ విడుదల కానుంది. తెలుగు వెర్షన్ లో ముఫాసా క్యారెక్టర్ కు మహేష్ చేత వాయిస్ చెప్పించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రిన్స్ ను భాగస్వామ్యం చేసేందుకు డిస్నీ సంస్థ చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఈ చర్చలు సఫలం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో యంగ్ ముఫాసాకు ఆయన కొడుకు గౌతమ్ తో వాయిస్ చెప్పించాలని భావిస్తున్నారట. ఈ విషయం తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.  

'ముఫాసా: ది లయన్ కింగ్' హిందీ వెర్షన్ కు షారుఖ్ ఫ్యామిలీ వాయిస్

ఇక 'ముఫాసా: ది లయన్ కింగ్' హిందీ వెర్షన్ లో బాలీవుడ్ బాద్ షా ఫ్యామిలీ భాగస్వాయ్యం అయ్యింది. షారుఖ్ ఖాన్ తో పాటు ఆయన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు.  2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ మూవీలో ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్, సింబా పాత్రకు ఆర్యన్ వాయిస్ ఇచ్చారు. ఇక 'ముఫాసా: ది లయన్ కింగ్'లో ముఫాసా యంగ్ రోల్, కింగ్ రోల్ ఉన్నాయి. యంగ్ ముఫాసాకు అబ్రామ్ వాయిస్ ఇచ్చారు. నిజానికి హిందీ ప్రేక్షకులలో అబ్రామ్ కు మాంచి క్రేజ్ ఉంది. ఆయన ఏ ఈవెంట్ కు వెళ్లినా, ఫోటోగ్రాఫర్లు ఆయన వెంటపడతారు. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మూవీతో ఆయన వాయిస్ డెబ్యూ ఇవ్వబోతోంది. షారుఖ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

రాజమౌళితో, మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం

మహేష్ బాబు చివరగా ‘గుంటూరుకారం’ సినిమాలో కనిపించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. SSMB29 పేరుతో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు రాబోతోంది. భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ ఈ సినిమా రూపొందబోతోంది.   

Read Also: ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ట్రైలర్ వచ్చేసింది - భూమిని కంపించేలా చేసిన ఓ సింహం కథ ఇది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget