అన్వేషించండి

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

మహేష్ బాబు ప్రస్తుతం కమర్షియల్ సినిమా చట్రంలో కూరుకుపోయారా? ఒకప్పుడు మహేష్ బాబు చేసిన ఆ ప్రయోగాలను మళ్లీ చూడలేమా?

హేష్... ఆ పేరు వింటేనే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఒక వైబ్రేషన్. ప్రిన్స్ అన్నపేరుకు సరిగ్గా సరిపోయే రూపం. టాలీవుడ్ కలల రాజకుమారుడు. ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయినా ఇప్పటికీ అందంలో ఆయన్ని కొట్టే మరో హీరో ఇంతవరకూ రాలేదని ప్రేక్షకులు చెప్పుకుంటారు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళుతున్న మహేష్ ప్రస్తుతం కమర్షియల్ సినిమా చట్రంలో కూరుకుపోయారని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు ఆయనకు అభిమానులు పెరిగారు కాబట్టి.. మహేష్ నిర్ణయంలో తప్పులేదనుకోండి. నిజానికి మహేష్ తన కెరీర్ తొలినాళ్లలో చేసినన్ని ప్రయోగాలు ఏ స్టార్ హీరో కూడా ఈ తరంలో చెయ్యడానికి సాహసించలేదు. ఒక్కసారి అవేంటో చూద్దామా...!

యువరాజు ( రెండో సినిమాలోనే బిడ్డ తండ్రిగా నటించిన మహేష్):

చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన 9 సినిమాలను పక్కనబెట్టి..బ్రేక్ తీసుకుని రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మహేశ్ తన రెండో సినిమాలోనే బిడ్డ తండ్రిగా నటించి అందరికీ షాక్ ఇచ్చాడు తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ ఇచ్చిన మహేష్ నెక్స్ట్ మూవీ లో ఇలాంటి క్యారెక్టర్ చెయ్యడం పెద్ద సాహసమే.పైగా తనకంటే పెద్దగా కనపడే సీనియర్ హీరోయిన్ లు సిమ్రాన్..సాక్షి శివానంద్ లతో నటించాడన్న విమర్శలు వచ్చినా లెక్క చెయ్యనే లేదు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ అయినప్పటికీ మహేష్ ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేసిన రేంజ్ లో మాత్రం హిట్ కాలేదు.

వంశీ (హీరోనా..సైడ్ హీరోనా):

కెరీర్ లో మూడో సినిమా.బీ.గోపాల్ లాంటి మాస్ డైరెక్టర్ తో మహేష్. మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్.చాలా ఏళ్ల తర్వాత తండ్రి కృష్ణ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు.ఇలా హై ఎస్పెక్టేషన్ లతో వచ్చిన సినిమా వంశీ.సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరోలా కనపడే మహేష్ ను పక్కన బెట్టి సెకండాఫ్ లో కృష్ణ కు పెద్దపీట వెయ్యడంతో సినిమా అట్టర్ ప్లాప్ అయింది.పైగా ఫస్ట్ ఆఫ్ లో షారుఖ్ నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే.. క్లయిమాక్స్ లో మిషన్ ఇంపాజిబుల్ 2లను కాపీ కొట్టారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమా పరంగా మహేష్ కు రెండు తీపి గుర్తులు మాత్రం మిగిలాయి. ఒకటి వ్యక్తిగత జీవితంలోకి నమ్రత ప్రవేశించింది ఈ సినిమాతోనే. రెండు ఆల్ టైం క్లాసికల్‌గా నిలిచిన పాటలు.

మురారి (డివోషనల్- ఫాంటసీ):

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారిని ఇప్పుడంటే క్లాసీక్ అంటున్నారు. కానీ.. రిలీజ్ అయిన కొత్తలో ప్లాప్ అన్నారు. రెండు వారాల తర్వాత హిట్ టాక్ అందుకుని.. తర్వాత కల్ట్ క్లాసిక్‌గా మారింది. హీరోయిజం ఉంటూనే.. డివోషనల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా టాలీవుడ్ లో నిలిచిపోయింది. ముఖ్యంగా మహేష్ నటనకు చాలా మంది ముగ్దులయ్యారు. చాలా మంది కొత్త అభిమానులు ఈ సినిమాతో పుట్టుకొచ్చారు.

టక్కరి దొంగ (నాన్న బాటలో ప్రయోగం):

టాలీవుడ్ చాలా ఏళ్ల క్రితం. పక్కన పెట్టేసిన కౌ బాయ్ జోనర్‌ను 2002లో మళ్లీ దుమ్ము దులిపి తెరమీదకు తెచ్చింది మహేష్ బాబే. జయంత్ సీ.పరంజీ 2002 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఆరోజుల్లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందింది. ఈ సినిమా వచ్చిన కొత్తలో ఈ సినిమా కృష్ణ నటించిన కౌ బాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాళ్లు’ తరహాలో ఉంటుందని అభిమానులు అంచనా వేశారు. అయితే స్లో నెరేషన్ కారణంగా అనుకున్న పెద్ద స్థాయిలో హిట్ కాలేదు. అలాగే హీరోయిన్ లు మిస్ మ్యాచ్ కావడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. మణిశర్మ మ్యూజిక్ మాత్రం పెద్ద హిట్ అయింది. 

బాబీ ( క్లైమాక్స్.. సినిమా రిజల్ట్.. రెండూ ట్రాజాడీ నే):

మహేష్ సినిమాల్లో అతిపెద్ద డిజాస్టర్ బాబీ.2002 లో వచ్చిన ఈ సినిమా గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఒక లవ్ యాంగిల్ యాడ్ చేస్తూ..హాలీవుడ్ క్లాసిక్ ఆ వెస్ట్ సైడ్ స్టోరీ ని పోలి ఉంటుంది. అప్పటి క్రేజీ హీరోయిన్.. మహేష్ బాబు ల కలయిక లో  లవ్ స్టొరీ..అది కూడా కె. రాఘవేంద్రరావు సారథ్యం లో అనేసరికి అభిమానులు ఎంతో ఊహించుకున్నారు.శోభన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా లో హీరో..హీరోయిన్ లు ఇద్దరూ చనిపోవడాన్ని అభిమానులే కాదు..ప్రేక్షకులూ తట్టుకోలేక పోయారు.దానితో కొన్ని థియేటర్ లలో క్లైమాక్స్ ను మార్చి మళ్లీ రిలీజ్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

నిజం (మహేష్ నటనకు నీరాజనం - ఫలితం మాత్రం శ్రద్ధాంజలి):

ఒక్కడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా నిజం.అప్పటికి తేజ అనే పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. నువ్వు-నేను,జయం వరుస హిట్లతో ఉన్న తేజ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా లంచం అనే ఝాడ్యం పై విమర్శనాత్మక సినిమాగా ఈ సినిమా రూపొందింది. ఒక్కడు కంటే ముందు మొదలైన ఈ సినిమా ఒక్కడు తర్వాత రిలీజ్ కావడమే సినిమాను దెబ్బ తీసింది అని తేజ అంటారు.ఒక్కడు తో మహేష్ రేంజ్ పెరిగిపోయింది.ఆ మాస్ ఇమేజ్ కు నిజం లోని పాత్ర సరిపోలేదు.పైగా హింస కాస్త ఎక్కువగా ఉండడం..హీరోయిన్ పాత్ర అతి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోయింది ఈ సినిమా. కానీ మహేష్.. విలన్ గా నటించిన గోపీచంద్ లకు మాత్రం నటన పరంగా గొప్ప పేరుని తెచ్చింది ఈ సినిమా.

నాని (మహేష్ ప్రయోగాలకు పరాకాష్ట):

S. J. సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా అనేసరికి మరో ఖుషీ లాంటి యూత్ ఫుల్ సినిమా అని ఫ్యాన్స్ భావిస్తే.. వాళ్ళకి మింగుడు పడని కథ తో సైన్స్ ఫిక్షన్ కామెడీని తీశాడు సూర్య. పగలంతా పెద్దోడి లా.. రాత్రయితే ఎనిమిదేళ్ల పిల్లాడిలా మారిపోయే క్యారెక్టర్ లో మహేష్ చేసిన ప్రయోగం ఫెయిల్ అయింది. అమీషా పాటిల్ లాంటి గ్లామరస్ హీరోయిన్.. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సినిమాను ఆడుకోలేక పోయాయి. విచిత్రంగా ఇదే సినిమాని యస్.జే. సూర్య తానే హీరోగా.. సిమ్రాన్ హీరోయిన్ గా తమిళంలో తీస్తే మాత్రం అది సూపర్ హిట్ అయింది.

1, నేనొక్కడినే (మాస్టర్ పీస్.. కానీ, 2 సార్లు చూస్తే అదుర్స్):

అతడు... పోకిరి.. దూకుడు.. బిజినెస్ మ్యాన్ లాంటి కమర్షియల్ సినిమాలు వరుస హిట్స్ తో కొంతకాలంగా ప్రయోగాలను పక్కన పెట్టేసిన మహేష్ కొంత గ్యాప్ తర్వాత చేసిన ప్రయోగం 1.నేనొక్కడినే. సుకుమార్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్.. మహేష్ ల కాంబినేషన్ లో విభిన్న స్క్రీన్ ప్లే లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎవరినీ ఆకట్టుకోలేదు. ఇప్పుడు మాత్రం క్లాసిక్ గుర్తింపు పొందింది. 

స్పైడర్ (అభిమానులకు ఇదంటే పెద్ద ‘డర్’)

2017 లో వచ్చిన ఈ సినిమా కూడా మహేష్ చేసిన ప్రయోగాల్లో ఒకటి. తన మాస్ హీరోయిజాన్ని పక్కన బెట్టి చేసిన ఈ సినిమా అభిమానులకు కూడా నచ్చలేదు. బైలింగ్యువల్ గా వచ్చిన ఈ సినిమా  అటు తమిళ్ ప్రేక్షకులనూ..ఇటు తెలుగు ఫ్యాన్స్ నూ ఆకట్టుకోలేక పోయింది. మురుగదాస్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్.. హారీస్ జైరాజ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయాయి. దానితో తాత్కాలికంగా ప్రయోగాలకు మహేష్ టాటా చెప్పేశారు.

తప్పు మహేష్‌ది కాదు:

మహేష్ బాబు చేసిన ప్రయోగాలు ఫెయిల్ కావడానికి ఆయన ఏమాత్రం కారణం కాదు. ఆ సినిమాలు రూపొందించడంలో డైరెక్టర్ లు చేసిన పొరబాట్లు.. ప్రేక్షకులను ఆకట్టుకోని కథనం ప్రధాన కారణం కాగా నాని, నేనొక్కడినే లాంటి సినిమాలు అప్పటి ప్రేక్షకుల అభిరుచి కన్నా ముందే వచ్చెయ్యడం వల్ల ప్లాప్ అయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి మహేష్ నటనకు పేరు తెచ్చినవి ఆయన చేసిన ప్రయోగాలే.

మారిన ప్రేక్షకుల అభిరుచి:

ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. క్రొత్త డైరెక్టర్ లకూ..సరి క్రొత్త ప్రయోగాలకూ పెద్ద పీట వేస్తున్నారు. కథాంశం క్రొత్తగా ఉంటే చాలు..హీరో ఎవరనేది కూడా పట్టించుకోవడం లేదు.ఈ నేపథ్యంలో మహేష్ ఒకప్పుడు చేసిన ప్రయోగాలకు మళ్లీ పెద్దపీట గనుక వేస్తే..టాలీవుడ్లో కలకాలం నిలిచిపోయే క్లాసిక్ లు రూపొందుతాయి అంటున్నారు విమర్శకులు. మరి సూపర్ స్టార్ ఆ దిశగా మళ్లీ ఆలోచిస్తారా...? లేదా అనేది చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget