MAA Elections: అతిగా ఏడ్చే మగాళ్లను నమ్మకండి.. ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ పై నరేష్ ఘాటు వ్యాఖ్యలు..
ఈరోజు బెనర్జీపై 'మా' మాజీ అధ్యక్షుడు నరేష్ దారుణమైన కామెంట్స్ చేశారు. బెనర్జీతో పాటు ఆ మీటింగ్ లో ఏడ్చిన మగాళ్లను ముండమోపులతో ఆయన పోల్చడం మరోసారి వివాదమైంది.
ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి మొత్తం 11 మంది గెలిచారు. అయితే ఈ పదవులకు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ సమయంలో బెనర్జీ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశారు. మోహన్ బాబు తనను బూతులు తిట్టారని చెప్పుకోండి బాధపడ్డారు. అయితే ఈరోజు బెనర్జీపై 'మా' మాజీ అధ్యక్షుడు నరేష్ దారుణమైన కామెంట్స్ చేశారు.
Also Read: మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు..తొలి సంతకం ఆ ఫైలుపై
బెనర్జీతో పాటు ఆ మీటింగ్ లో ఏడ్చిన మగాళ్లను ముండమోపులతో ఆయన పోల్చడం మరోసారి వివాదమైంది. 'మా' నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. అలానే మంచు విష్ణు ప్యానెల్ లో గెలుపొందిన ఇతరులు కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి నరేష్ కూడా హాజరయ్యారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాలపై స్పందించమని మీడియా నరేష్ ని ప్రశ్నించగా.. ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎమోషన్స్, మానసిక ఒత్తిళ్లతో 'మా'ను డిస్టర్బ్ చేయొద్దని కోరారు. ఎన్నికలైపోయిన తరువాత కూడా ఇంకా ఆరోపణలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. వాళ్ల రాజీనామాల విషయంపై 'మా' సభ్యులే చూసుకుంటారని.. నేను మాట్లాడనని అన్నారు. తమకు కావాల్సిన వాళ్లను 'మా' సభ్యులు గెలిపించుకున్నారని.. అలాంటప్పుడు ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
అసలు రాజీనామాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. ఓడినా, గెలిచినా కలిసి పనిచేస్తామని చెప్పిన వాళ్లు.. మాట మీద నిలబడాలి కదా అని అడిగారు నరేష్. 'మా' ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలను నరేష్ ఖండించారు. ముండమోసినట్టు ఎందుకు ఏడుస్తున్నారని నరేష్ ఘాటు కామెంట్స్ చేశారు. కొందరు మగాళ్లు ఏడవడం చూశానని.. మగాళ్లు ఎందుకు ఏడుస్తారు..? అతిగా ఏడ్చే మగాళ్లను నమ్మకూడదు అంటూ నరేష్ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ కలిసి పనిచేద్దామనే అంటున్నామని తెలిపారు.
Also Read: బిగ్ బాస్ బ్యూటీకి షాకిచ్చిన హ్యాకర్స్..సైబర్ పోలీసులను ఆశ్రయించిన గుజరాతీ పిల్ల
Also Read: ‘బిగ్ బాస్’లో తల్లీకూతుళ్ల వార్.. తొక్కలో రిలేషన్‌షిప్ వద్దంటూ ఆనీ కన్నీళ్లు
Also Read: ‘పంచతంత్రం’ టీజర్.. ముసలి తాబేలు చెప్పే మన కథలు.. బ్రహ్మీ ఈజ్ బ్యాక్!
Also Read: ‘పుష్ప’ నుంచి సెకండ్ సింగిల్ శ్రీవల్లి ఫుల్ సాంగ్ ఇదిగో..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి