అన్వేషించండి
Advertisement
MAA Elections: ‘నాగబాబు అంకుల్.. మీరెందుకు అంత దిగజారుతున్నారు.. వరుణ్‌ను అంటే తట్టుకోగలరా?’.. విష్ణు కౌంటర్
ఎన్నికల ప్రచారం సమయంలో ప్రకాష్ రాజ్ అభ్యర్థి మంచు విష్ణుపై నాగబాబు కొన్ని కామెంట్స్ చేశారు. వాటిపై స్పందింస్తూ మంచు విష్ణు ఓ వీడియోను విడుదల చేశారు.
'మా' ఎన్నికల్లో మెగాబ్రదర్ నాగబాబు.. ప్రకాష్ రాజ్‌ని సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల ‘మా’ సభ్యులతో జరిగిన సమావేశంలో మంచు విష్ణుపై నాగబాబు కొన్ని కామెంట్స్ చేశారు. వాటిపై స్పందిస్తూ మంచు విష్ణు ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయనేం చెప్పారంటే.. రేపు జరగబోయే ఎన్నికల కోసం ప్రపంచంలోకి తెలుగు వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. చాలా మంది తనతో చెబుతున్నారని మంచు విష్ణు అన్నారు. 'మా' ఎన్నికల్లో తను పోటీ చేస్తున్నానని చెప్పినప్పటి నుంచి అపోజిషన్ ప్యానెల్ లోని అభ్యర్థి తీవ్రంగా విమర్శించారని.. మెల్లగా తన కుటుంబాన్ని కూడా విమర్శించడం మొదలుపెట్టారని తెలిపారు. ఆయనతో పాటు సీనియర్ నటి కూడా విమర్శలు చేశారని వాపోయారు.
వీటి వలన చాలా బాధపడ్డానని చెప్పారు. ఆ అభ్యర్థిని నిలబెట్టిన వాళ్లలో ఒకరు బహిరంగంగా బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారని.. నాగబాబు పేరు చెప్పారు. ''అంకుల్ నేనేంటో మీకు తెలియదా..? మీ ముందు పెరిగినవాడిని. మా సంస్థలో కూడా మీరు పని చేశారు. మా ఫ్యామిలీ మొత్తం మీకెంతో గౌరవం ఇస్తారు. నేనేం చేశాను.. ఎనిమిది నెలల ముందు నా అపోజిషన్ లో నిలబడిన మేధావి పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్లు మాట్లాడారు. దానికి మీరు ఆయన్ను తిడుతూ.. మీ స్టైల్ లో ట్వీట్ చేశారు. ఈ రోజు అతను మేధావి, మంచి వ్యక్తి అయిపోయాడు. మీ ముందు పెరిగినవాడినైన నన్ను ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు. మీ బిడ్డలాంటోడిని. మీరంటే నాకిష్టం. చిరంజీవి గారంటే అభిమానం. మిమ్మల్ని విమర్శిస్తే ఆయన్ని అవమానించినట్లే కదా.. కాబట్టి పొరపాటు కూడా మిమ్మల్ని విమర్శించను. నన్ను అలా పెంచలేదు'' అంటూ చెప్పుకొచ్చారు మంచు విష్ణు.
''మీరు నా గురించి మాట్లాడండి. మా నాన్నగారిని సంబోధించకండి. మా నాన్నగారిని మీరు గౌరవిస్తారని తెలుసు. అన్నయ్య అని పిలుస్తారు. దయచేసి మా ఫ్యామిలీ జోలికి రాకండి. మీరు నన్ను విమర్శిస్తున్నారు కదా.. అనే నేను కానీ మా ఫ్యామిలీ కానీ.. మీ వరుణ్ ని విమర్శిస్తే మీ మనసుకు ఎంత కష్టమవుతుంది. కానీ మేం ఆ పని చేయం. ఎందుకంటే వరుణ్ నాకు సోదరుడితో సమానం. నేను మీకు వరుణ్ లాంటోడినే కదా. మా ఎన్నికల కోసం మీరెందుకు అలా దిగజారుతున్నారు..?'' అంటూ ప్రశ్నించాడు మంచు విష్ణు.
''మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఏమైనా మాట్లాడితే.. నాది, నా కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు మీ ఫ్యాన్స్‌కు ఇచ్చి తిట్టమని చెబుతారు. కావాలంటే మీరు మా నెంబర్లు ఇవ్వవచ్చు. రాజశేఖర్, ఆయన భార్య జీవిత పిల్లలతో కారులో వెళ్తుంటే మీ ఫ్యాన్స్‌ను పంపి, దాడి చేయించలేదా..? వాళ్లే షూట్ చేసి, టీవీ వాళ్లకు ఇచ్చారు. ఇది మీరు నాకు కూడా చేయొచ్చు'' అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు విష్ణు.
పెద్ద మనిషిగా ఉంటూ మీరలా మాట్లాడడం కరెక్ట్ కాదని.. ఏ ఫ్యామిలీ పర్ఫెక్ట్ గా లేదని.. నాన్నగారు బయటకు వచ్చి మాట్లాడితే బంధాలన్నీ తెగిపోతాయని.. అంత దూరం లాగొద్దని నాగబాబుకి వార్నింగ్ ఇచ్చారు మంచు విష్ణు.
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion