Prudhvi Raj: పృథ్విరాజ్ స్వీట్ వార్నింగ్.. అతడిలో మీకు ఏం నచ్చింది? ఫోన్ కాల్ లీక్!
ఏపీ ‘మా’ ప్రతినిధులకు పృథ్విరాజ్ వార్నింగ్ ఇచ్చారంటూ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఆడియో.
మంచు విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేస్తున్న కమెడియన్ పృథ్విరాజ్ ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధికి ఫోన్ చేసి మాట్లాడటం వివాదస్పదమైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్‌ను ఇటీవల విశాఖకు చెందిన ఏపీ ‘మా’ సన్మానం చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో మద్దతు మీకేనని ప్రకటించినట్లు తెలిసింది. ఈ సందర్భంగడా పృథ్విరాజ్ ఏపీ ‘మా’ ప్రతినిధికి ఫోన్ చేసి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా మీడియాలో పృథ్విరాజ్ ఫోన్ కాల్ అంటూ ఓ ఆడియో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.
ఈ ఫోన్ కాల్ ప్రకారం.. పృథ్విరాజ్ ఏపీ ‘మా’ ప్రతినిధితో మాట్లాడినట్లుగా ఉంది. ‘‘ప్రకాష్ రాజ్‌కు సన్మానం చేయడం బాధనిపించింది. ఇండస్ట్రీలో 30 ఏళ్ల నుంచి ఉంటున్నాం. నాకు ఆర్టిస్టులంతా తెలుసు. అందరితో నాకు మంచి రిలేషన్ ఉంది. పాతికేళ్లుగా ఓటు వేయని వ్యక్తి ప్రకాష్ రాజ్. కోవిడ్ సమయంలో మేము ఇంటింటికి తిరిగి సేవలు చేశాం. బాధితులకు బెడ్‌లు ఇప్పించాం. ఇన్ని సేవలు చేస్తే తెలుగువాడు అధ్యక్షుడిగా వద్దా? అతడికి సన్మానం చేయడమే కాకుండా.. వీడియోల్లో ‘విష్ణు ఎవడు’ అని థంబ్ ఫొటో పెట్టించారు’’ అని పేర్కొన్నారు.
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్న విభేదాలు
కర్ణాటకలో నన్ను అవమానించారు: ‘‘పక్కోళ్లు మనల్ని తొక్కుతున్నా కూడా మన నవ్వుతున్నాం. అందుకే మనం డెవలప్ కావడం లేదు. మళ్లీ మనం కలుసుకోవాలి. షూటింగులు చేసుకోవాలి. విశాఖలో నాకు చాలామంది తెలుసు. అతడిలో ఏం చూసి మీరు మా మద్దతు మీకే ఉందని చెబుతారు? అతడిని ‘మా’ రెండు సార్లు సస్పెండ్ చేసింది. నేను అందుకే డెబలప్ కావడం లేదు. మళ్లీ మనం కలుసుకోవాలి. షూటింగులుచేసుకోవాలి. విశాఖ రావాలి. విశాఖలో చాలామంది నాకు తెలుసు. అతడిలో ఏం చూసి మీరు మా మద్దతు మీకే ఉందని చెబుతారు? మూవీ రెండు సస్పెండ్ చేశారు. కన్నడ సినిమాలో నేను లేడీ గెటప్ వేస్తే విగ్గు లాగేసి.. కన్నడవాళ్లే నటించాలి అన్నారు. దీంతో నేను సిగ్గుతో వచ్చేశాను. భారత దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. కానీ, మన మీద పోటీ చేయకూడదు. అతడు మీకు అంతగా నచ్చాడా. మధ్యలో సన్మానం చేయడం నచ్చలేదు. మేం కూడా వైజాగ్‌కు షూటింగ్‌కు వస్తాం’’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఆ ఫోన్ కాల్ వాయిస్‌లో ఉంది. అయితే, ఆ ఫోన్‌లో మాట్లాడింది పృథ్విరాజా.. కాదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి