By: ABP Desam | Updated at : 02 Oct 2021 03:18 PM (IST)
ధనుష్ భార్య కొత్త ప్రాజెక్ట్
భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా... రజనీకాంత్, అక్షయ్‌కుమార్ నటించిన '2.0'ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అదొక్కటే కాదు. ఇంకా పలు భారీ బడ్జెట్, హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'రామ్ సేతు'తో హిందీ పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది. జాన్వీ కపూర్ కథానాయికగా 'గుడ్ లక్ జెర్రీ' నిర్మిస్తోంది. హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాలు నిర్మిస్తోంది. ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమా చేయడానికి లైకా ప్రొడక్షన్స్ సిద్ధమైంది.
Also Read:ఉదయాన్నే మేనిఫెస్టో ప్రకటించి.. మా అధ్యక్ష అభ్యర్థి పదవికి వేసిన నామినేషన్ ఉపసంహరించుకున్న నటుడు
సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె, హీరో ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాతలు సుభాస్కరన్, మహవీర్ జైన్ స్ట్రయిట్ తెలుగు సినిమా నిర్మించనున్నారు. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా '3'తో ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయమయ్యారు. తెలుగులో కూడా ఆ సినిమా విడుదలైంది. ఆ తర్వాత 'వెయ్ రాజా వెయ్' చేశారు. ఇప్పుడు దర్శకురాలిగా మూడో సినిమా, తెలుగులో చేయడానికి ఐశ్వర్య ఆర్. ధనుష్ సిద్ధమవుతున్నారు. పాన్ ఇండియన్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా ఐశ్వర్య ఆర్. ధనుష్ మాట్లాడుతూ.. ''లైకా ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాను. పాన్ ఇండియన్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది'' అని చెప్పారు.
లైకా ప్రొడక్షన్స్ సీఈవో ఆశిష్ సింగ్ మాట్లాడుతూ ''మా సంస్థలో తొలి స్ట్రయిట్ తెలుగు సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండటం మాకెంతో ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం మాకుంది'' అని చెప్పారు.
సినిమాలో నటీనటులు, పని చేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Also Read: నాలుగేళ్ల క్రితం ఆగిన 'ఆరడుగుల బుల్లెట్' మెగా హీరోకి పోటీగా ఇప్పుడు దూసుకొస్తోంది..
Also Read: అల్లు కుటుంబం తరపున మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పిన బన్నీ..ఏకి పారేస్తున్న నెటిజన్లు
Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు
Samudram Chittabbai: ఈ రాజ్యంలో రాణే రాజుని వదిలేస్తుంది - ఆసక్తికరంగా ‘సముద్రం చిట్టబ్బాయి’ ట్రైలర్
Jamuna Death: సీనియర్ నటి జమున మృతి పట్ల సినీ ప్రముఖుల నివాళి
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
Tollywood Deaths, Shocks - 27th Jan : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!