కృష్ణ-మహేష్ సేమ్ టు సేమ్! తండ్రీ కొడుకుల వీడియో చూడ్డానికి రెండు కళ్లు సరిపోవంటే నమ్మండి!
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కొద్ది రోజుల క్రితమే కన్నుమూశారు. యాతవ్ సినీ పరిశ్రమకు ఆయనకు ఘన నివాళి అర్పించింది. తాజాగా కృష్ణ, మహేష్ బాబుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు తెరకు అద్భుత టెక్నాలజీని పరిచయం చేయడంతో పాటు అన్ని జోనర్లలో సినిమాలు చేసి మెప్పించిన ఘనుడు. సుమారు 5 దశాబ్దాల సినీ కెరీర్ లో ఏకంగా 350 సినిమాల్లో కృష్ణ నటించారు. ఏడాదికి 10 సినిమాలకు పైనే చేసిన సందర్భాలున్నాయి. 1972లో ఏకంగా 17 సినిమాల్లో నటించి.. ప్రపంచ రికార్డు సాధించారు. ఒక ఏడాదిలో ఇన్ని సినిమాలు చేయడం ఏ సినిమా పరిశ్రమలోనే లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడుగా ఎన్నో బాధ్యతలను నిర్వహించారు. సినిమాకు సంబంధించిన 24 రంగాల్లో ఆయనకు మంచి అవగాహన ఉండేది.
కృష్ణకు కన్నీటి వీడ్కోలు పలికిన అభిమానులు
79 ఏళ్ల వయసులో ఘట్టమనేని కృష్ణ కన్నుమూశారు. నిర్మాతలకు ఎంతో ఇష్టమైన కృష్ణ, తన ప్రస్థానాన్ని ముగించారు. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశ, విదేశాల్లోని ఆయన అభిమానులు నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని, సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవను నెమరువేసుకున్నారు. హైదరాబాద్ లో మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలను చూసేందుకు వేలాదిగా ఆయన అభిమానులు హైదరాబాద్ కు చేరుకున్నారు. అభిమాన నటుడిని కడసారి చూసి కన్నీటి వీడ్కోలు పలికారు.
ఆకట్టుకుంటున్న కృష్ణ - మహేష్ వీడియో
నిజానికి మహేష్ బాబుకు కృష్ణ అంటే ఎంతో ఇష్టం. ఆయనతో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడేవారు. వీలున్నప్పుడల్లా తన సతీమణి నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి ఆయన దగ్గరికి వెళ్లి టైమ్ స్పెండ్ చేసేవారు. ఆయన మరణంతో మహేష్ బాబు ఎంతో ఆవేదనకు గురయ్యారు. తండ్రికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఇక సోషల్ మీడియాలో కృష్ణకు సంబంధించిన ఎన్నో మధుర జ్ఞాపకాలను నెటిజన్లు పంచుకుంటున్నారు. ఆయన సినిమాల్లోని అద్భుత సన్నివేశాలను, ఆయన అరుదైన చిత్రాలను షేర్ చేస్తూ మహనీయుడిని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా మహేష్ బాబు అభిమానులు ఓ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ కృష్ణ, ఆయన కుమారుడు టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు నటించిన సినిమాల్లోని సీన్లతో ఓ వీడియోను రూపొందించారు. తండ్రీ కొడుకులు ఇద్దరీ సేమ్ సీన్లలో కనిపించే సన్నివేశాలను ఇందులో పొందుపర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సూపర్ స్టార్ అభిమానులతో పాటు, మహేష్ బాబు ఫ్యాన్స్ ను ఎంతో ఆకట్టుకుంటోంది. తండ్రీ కొడుకులకు సంబంధించిన వీడియోను మీరూ చూసేయండి.
The resemblance♥️@urstrulymahesh #KrishnaGarupic.twitter.com/05sAr9atVX
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) November 18, 2022
Read Also: ఇండియానా జోన్స్ రేంజ్‌లో అడ్వెంచర్స్ - మహేష్ బాబు మూవీపై కీలక విషయాలు చెప్పిన రాజమౌళి