అన్వేషించండి

SS Rajamouli: ఇండియానా జోన్స్ రేంజ్‌లో అడ్వెంచర్స్ - మహేష్ బాబు మూవీపై కీలక విషయాలు చెప్పిన రాజమౌళి

రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. హాలీవుడ్ రేంజిలో అడ్వెంచర్ మూవీ రూపొందిచబోతున్నట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందన్నారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటారు దర్శకుడు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా, కొమురం భీం, సీతా రామ రాజు పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు సినిమా పరిశ్రమతో పాటు దేశ, విదేశాల్లోనూ సంచలన విజయాన్ని అందుకుంది. తాజాగా జపాన్ లో విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాహుబలి సినిమా తర్వాత ఆరేంజిలో విజయాన్ని అందుకుంది ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు జక్కన్న వెల్లడించాడు. అయితే, సినిమా కథకు సంబంధించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నా, ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కనిపించని యాక్షన్ అడ్వెంచర్ మూవీ

తాజాగా తన తర్వాతి ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను స్వయంగా జక్కన్నే వివరించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి అమెరికాలో ప్రచారం చేస్తున్న రాజమౌళి.. నెక్ట్స్ మూవీ వివరాలను వెల్లడించాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ తర్వాతి సినిమా కథ ఏమిటని అడిగిన ప్రశ్నకు.. ఆయన కీలక విషయాలు వివరించారు. తనకు అడ్వెంచర్ సినిమాలు అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు కనిపించని సరికొత్త యాక్షన్ అడ్వెంచర్ మూవీని రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఇండియానా జోన్స్ తరహా చిత్రంలా రూపొందిస్తున్నట్లు తెలిపాడు.   

స్ట్రిప్ట్ వర్క్ జరుగుతోందన్న జక్కన్న

“ఇప్పుడే నా తర్వాతి సినిమా గురించి చెప్పడం కాస్త కష్టం. మామూలుగా నా సినిమాలన్నింటికీ, మా నాన్న విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుంటారు. నా తర్వాత సినిమాకు సంబంధించిన కథ గురించి మా టీం అంతా చర్చిస్తారు. రెండు నెలల క్రితమే నా నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాం. ఈ చిత్రం తనకు బాగా నచ్చిన హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ మాదిరిగా ఉండాలని భావిస్తున్నాను. నేను చాలా కాలంగా ఓ అడ్వెంచర్ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకు స్వయంగా అడ్వెంచర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం. అలాంటి కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుందని మాత్రం చెప్పగలను” అంటూ జక్కన్న హింట్ ఇచ్చారు.

‘బాహుబలి, ‘ఆర్ఆర్ఆర్’ను మించి ఉండేలా జాగ్రత్తలు   

మొత్తంగా తన తర్వాత సినిమా ‘బాహుబలి, ‘ఆర్ఆర్ఆర్’ను మించి ఉండేలా జక్కన్న సినిమా కథను చెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకపోయినా, కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు టాక్ నడుస్తోంది. తన కెరీర్ లోనే అద్భుత సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నా అని అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. MB28గా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యింది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read Also: నాగశౌర్య వరుడయ్యాడు, ఈ రోజే పెళ్లి - హల్దీ వేడుక ఫొటోలు వైరల్

టాప్ హెడ్ లైన్స్

Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget