News
News
X

Naga Shaurya Wedding: నాగశౌర్య వరుడయ్యాడు, ఈ రోజే పెళ్లి - హల్దీ వేడుక ఫొటోలు వైరల్

నాగశౌర్య ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది. కాసేపట్లో ఆయన పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

FOLLOW US: 

యువ నటుడు నటుడు నాగశౌర్య కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇవాళ మధ్యాహ్నం బెంగళూరుకు చెందిన అనూష మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. ఇరు కుటుంబ సభ్యులు అట్టహాసంగా నాగశౌర్య- అనూష వివాహం జరిపించేందుకు సిద్ధం అయ్యారు. వీరి కల్యాణ వేడుక బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరగనుంది. పెళ్లి వేడుకలో భాగంగా హల్దీ సెలబ్రేషన్ కలర్ ఫుల్ గా జరిగింది. అనంతరం కాక్ టెయిల్ పార్టీ జరిగింది. ఇందులో ఇరు కుటుంబాలకు చెందిన బంధు మిత్రులు పాల్గొన్నారు. ఇక హల్దీ వేడుకలో భాగంగా కాబోయే శ్రీమతికి నాగశౌర్య బంగారు ఉంగరాన్ని తొడిగాడు. కుటుంబ సభ్యులు, వధూవరుల మిత్రుల సమక్షంలో ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది. ప్రస్తుతం హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నాగశౌర్య- అనూష జోడీ చాలా బాగుందని కామెంట్స్ పెడుతున్నారు.

ఇంటీరియర్ డిజైనర్ గా అనూషకు మంచి గుర్తింపు

కొద్ది రోజుల క్రితమే తన  పెళ్లి విషయాన్ని నాగశౌర్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. బెంగళూరుకు చెందిన అనూషను వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పారు. ఇక  అనూష విషయానికి వస్తే, తను బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్ గా ఉన్నారు. సొంతంగా ఓ ఇంటీరియర్ డిజైన్ సంస్థను స్థాపించారు. ఆమె కుటుంబం వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె ప్రతిభకు ఎన్నో అవార్డులు వరించాయి కూడా.  బెంగళూరులో అనూషతో నాగశౌర్యకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా, ప్రేమగా మారింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం చెప్పారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి బెంగళూరు వేదికగా జరుగుతోంది.

‘కృష్ణ వ్రింద విహారి’ మూవీతో ఆకట్టుకున్న నాగశౌర్య

ఇక నాగశౌర్య సినిమాల విషయానికి వస్తే.. ఈ సంవత్సరం ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వాస్తవానికి నాగశౌర్య విజయం, పరాజయంతో సంబంధం లేకుండా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నాడు.  సొంత బ్యానర్ లోనే నాగశౌర్య ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన కెరీర్ లో ‘శౌర్య’ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పెళ్లి తర్వాత నాగ శౌర్య మరికొన్ని ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉంది.  

Read Also: నోట్ల రద్దుపై ఎవరు నిజం చెబుతున్నారు? ప్రధాని మోడీపై ప్రకాష్ రాజ్ కామెంట్స్, నెటిజన్స్ గుర్రు

News Reels

View this post on Instagram
 
A post shared by buttabomma dreams (@sivakameswarisomireddy)

View this post on Instagram
 
A post shared by Hyderabad Page3 People (@hyderabad_page3people)

View this post on Instagram
 
A post shared by SIIMA (@siimawards)

Published at : 20 Nov 2022 11:11 AM (IST) Tags: actor naga shaurya naga shaurya wedding naga shaurya wedding celebration anusha naga shaurya wife

సంబంధిత కథనాలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

టాప్ స్టోరీస్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి