అన్వేషించండి

Leo: సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘లియో’ ఫ్యాన్ మేడ్ 3D ట్రైలర్ - మీరు చూశారా?

విజయ్ వీరాభిమాని అయిన మ్యాడీ మాధవ్ తన అభిమాన నటుడి కోసం సొంతంగా ఓ ట్రైలర్ ను తయారు చేశాడు. దాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడా ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Leo: తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ నుంచి వస్తోన్న తర్వాత మూవీ ‘లియో’ గురించి ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ‘విక్రమ్’ సినిమాతో ఒక కొత్త యూనివర్స్ ను క్రియేట్ చేసిన లోకేష్ ‘లియో’ తో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్దంగా ఉన్నాడు. అందులోనూ ‘లియో’ మూవీ లోకేష్ యూనివర్స్ లో భాగం అని కూడా అంటున్నారు. దీంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పిటికే సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ రివీల్ వీడియో, ఫస్ట్ లుక్ కు విపరీతమైన క్రేజ్ వస్తోంది. దీంతో మూవీ టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే సినిమా నుంచి అధికారికంగా ఎలాంటి అప్డేట్ లు రాకుండానే ఓ ట్రైలర్ ను సొంతంగా తయారు చేసి రిలీజ్ చేశాడు విజయ్ వీరాభిమాని. అది కూడా 3డి లో ఇప్పుడీ ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.  

ట్రెండింగ్ లో ‘లియో’ ఫ్యాన్ మేడ్ ట్రైలర్..

తాము అభిమానించే హీరోల కోసం ఏం చేయడానికైనా సిద్దపడుతుంటారు కొంత మంది అభిమానులు. దళపతి విజయ్ కు కూడా అలాంటి అభిమానులు చాలా మందే ఉన్నారు. అలాంటి అభిమానుల్లో ఒకరు తయారు చేసిందే ఈ ‘లియో’ ట్రైలర్. విజయ్ వీరాభిమాని అయిన మ్యాడీ మాధవ్ తన అభిమాన నటుడి కోసం సొంతంగా ఓ ట్రైలర్ ను తయారు చేశాడు. దాన్ని ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు మాధవ్. ఈ ట్రైలర్ మొత్తం 3 నిమిషాల 30 సెకన్ల నిడివి ఉంది. ఈ ట్రైలర్ ను యానిమేషన్ టెక్నాలజీతో పాటు త్రిడి ఎఫెక్ట్స్ తో సినిమా లెవల్ కు ఏమాత్రం తగ్గకుండా ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ ట్రైలర్ 24 గంటల్లోనే 8 మిలియన్ల వీక్షణలు లక్షన్నర లైక్ లు 40 వేల రీట్వీట్ లను  సొంతం చేసరుకుంది. అంతే కాదు మనోజ్ పరమహంస, అశ్విన్ రామ్, మణికందన్, వెంకట్ ప్రభు సెలబ్రెటీలు కూడా ఈ వీడియోను మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు. 

ఇంతకీ ఆ ట్రైలర్ వీడియోలో ఏముందంటే?

నిజంగా ఓ వీరాభిమాని తన అభిమాన హీరోను ఊహించుకొని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనే దానికి మ్యాడీ మాధవ్ చేసిన వీడియోనే ఉదాహరణ. అంతగా రిచ్ లుక్ లో విజయ్ ను చూపించాడు మాధవ్. ట్రైలర్ లో హీరో(విజయ్) తన రోల్స్ రాయిస్ కార్ లో ఓ కారును వెంబడిస్తూ ఉంటారు. ఓ అందమైన అమ్మాయి కారు నడుపుతుండగా వెనుక సీట్ లో హీరో కూల్ గా కూర్చొని కనిపిస్తాడు. తర్వాత కారును ఓవర్ టేక్ చేయమని చెప్పి తన దగ్గర ఉన్న గన్స్ తో ప్రత్యర్థులను హతమారుస్తాడు. ఈలోపు ఇంకొన్ని కార్లు వచ్చి హీరో ను చుట్టుముడతాయి. అప్పుడు హీరో కారులో నుంచి ఓ కత్తిని తీసి ‘బ్లడీ స్వీట్’ అనే టైలాగ్ చెప్తాడు అంతటితో ట్రైలర్ ముగుస్తుంది. చెప్పడానికి ఇది సింపుల్ గానే ఉన్నా అత్యాధునిక టెక్నాలజీ, 3డి ఎఫెక్ట్స్ తో విజువల్ వండర్ లా చేశాడు మాధవ్. అందుకే రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియో అటు ఇటు తిరిగి విజయ్ దగ్గరకు చేరిందని, ఇది చూసి విజయ్ హర్షం వ్యక్తం చేస్తూ తనను కలవాల్సిందిగా ఆ అభిమానికి కబురు పంపాడనే టాక్ కూడా ఫిల్మ్ వర్గాల్లో నడుస్తోంది. ఇక విజయ్ నటించిన ‘లియో’ మూవీ అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది త్వరలోనే మూవీకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ను విడుదల చేయనున్నారు మేకర్స్.

Also Read: రికార్డు ధరకు ‘లియో’ తెలుగు రైట్స్ - ‘విక్రమ్’ క్రేజ్ కలిసొస్తుందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balakrishna: వింటేజ్ బాలకృష్ణ కాదు... న్యూ ఏజ్ - అప్డేట్ ఇచ్చిన NBK111 టీమ్
వింటేజ్ బాలకృష్ణ కాదు... న్యూ ఏజ్ - అప్డేట్ ఇచ్చిన NBK111 టీమ్
Lalit Modi Sushmita Sen Breakup: సుస్మితా సేన్‌తో బ్రేకప్... రీజన్ రివీల్ చేసిన లలిత్ మోడీ
సుస్మితా సేన్‌తో బ్రేకప్... రీజన్ రివీల్ చేసిన లలిత్ మోడీ
Ram Charan Vs NTR: రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?
రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?
Trisha Krishnan : రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Trisha Krishnan : రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
Embed widget