Lavanya Tripathi: సమంత బాటలో లావణ్య త్రిపాఠి, ‘పులి-మేక’తో కొత్త ప్రయత్నం!
లావణ్య త్రిపాఠి ఓటీటీలోకి ఎంటర్ అవుతోంది.
హీరోయిన్‌గానే కాకుండా ‘ఫ్యామిలీ మ్యాన్-3’ వెబ్ సీరిస్‌లో నెగటివ్ పాత్రతోనూ ఆకట్టుకుంది సమంత. ఆమె కంటే ముందే కాజల్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్స్ కూడా వెబ్ సీరిస్‌లో నటించారు. తాజాగా లావాణ్య త్రిపాఠి కూడా అటు వైపే అడుగులు వేస్తోంది. ‘అందాల రాక్షిసి’గా ప్రేక్షకుల మది దోచిన ఈ సొట్ట బుగ్గల బ్యూటీ.. ‘హ్యాపీ బర్త్ డే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు 'పులి-మేక' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేస్తోంది.
కోన వెంకట్ ఈ సిరీస్‌కు కథ అందించగా.. చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో గోపీచంద్ హీరోగా 'పంతం' అనే సినిమాను తెరకెక్కించారు ఈ దర్శకుడు. ఈ వెబ్ సిరీస్‌లో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. పోలీసులను టార్గెట్ చేసుకుని ఒకరి తర్వాత ఒకరిని చంపుతున్న ఓ సీరియల్ కిల్లర్ కథతో ‘పులి-మేక’ తెరకెక్కనుంది. ఈ థ్రిల్లర్ అంశానికి జాతకాలను మిక్స్ చేస్తూ.. రాసిన డిఫరెంట్ స్టోరీ ఇది. ఇదే వెబ్ సిరీస్‌తో హీరో ఆది సాయికుమార్ కూడా ఓటీటీలోకి ఎంటర్ అవుతున్నారు. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Also Read: మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'సైన్యం' ఆగింది
Also Read: 'విక్రమ్', 'మేజర్' వల్లే అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ప్లాప్ అయ్యిందా? హీరోయిన్ మాటలు విన్నారా?
View this post on Instagram
View this post on Instagram