Mahesh Babu Movie Shelved: మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'సైన్యం' ఆగింది
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమా రూపొందుతోంది. అయితే... వీటి మధ్యలో మరో సినిమా ఉండాల్సింది. దాని గురించి తెలుసా?
![Mahesh Babu Movie Shelved: మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'సైన్యం' ఆగింది Mahesh Babu Trivikram Srinivas supposed to do Sainyam movie in MS Raju production which was shelved due to various reasons, says Sumanth Ashwin Mahesh Babu Movie Shelved: మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'సైన్యం' ఆగింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/18/38e9e577d2888bac84b9f0a50b05784c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'అతడు', 'ఖలేజా'... సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు. ఇప్పుడు మూడో సినిమా SSMB 28 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఉంది. ప్రస్తుతం సంగీత దర్శకుడు తమన్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. అయితే... 'అతడు', 'ఖలేజా', ఇప్పుడీ హ్యాట్రిక్ సినిమా కాకుండా మహేష్, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయాలని అనుకున్నారు. ఆ సినిమా టైటిల్ 'సైన్యం'. కానీ, సెట్స్ మీదకు వెళ్లకముందే సినిమా ఆగింది.
మహేష్ బాబుకు నిర్మాత ఎంఎస్ రాజు'ఒక్కడు' వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమాకు సన్నాహాలు జరిగాయి. కానీ, పట్టాలు ఎక్కలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'ఖలేజా' నిర్మించే అవకాశం తన దగ్గరకు వస్తే కథ నచ్చక చేయలేదని ఎంఎస్ రాజు ఈ మధ్య చెప్పారు. 'ఖలేజా' కథనే ముందు 'సైన్యం'గా తీయాలని అనుకున్నారా? లేదంటే మరొక కథతో 'సైన్యం' అనుకున్నారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 'సైన్యం' సినిమా ఆగిన విషయం గురించి అయితే ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ చెప్పారు.
''మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ కలయికలో అప్పట్లో ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. 'సైన్యం' అనుకున్నారు. కానీ, స్టార్ట్ కాలేదు. ఆ సినిమా డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్ గారు నా ఫోటోలు కొన్ని చూసి 'బావున్నాడు. బాడీ మీద కాన్సంట్రేషన్ చేస్తే హీరో అవుతాడు' అన్నారు. ప్రభుదేవా గారు కూడా బావున్నానని చెప్పారు. ఆ మాటలు మనసులో ఉండిపోయాయి. ముంబై వెళ్లి యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుని వచ్చి హీరో అయ్యా'' అని '7 డేస్ 6 నైట్స్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమంత్ అశ్విన్ చెప్పుకొచ్చారు.
Also Read: 'విక్రమ్', 'మేజర్' వల్లే అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ప్లాప్ అయ్యిందా? హీరోయిన్ మాటలు విన్నారా?
'డర్టీ హరి' తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన సినిమా '7 డేస్ 6 నైట్స్'. ఈ సినిమాతో సుమంత్ అశ్విన్ నిర్మాతగా మారుతున్నారు. అలాగే, ఇందులో ఆయన ఒక హీరోగా నటించిన సంగతి తెలిసిందే. జూన్ 24న సినిమా విడుదల కానుంది. కుటుంబ సభ్యులతో కలిసి చూసేలా '7 డేస్ 6 నైట్స్' ఉంటుందని, సినిమాలో చీప్ కంటెంట్ లేదని సుమంత్ అశ్విన్ తెలిపారు.
Also Read: మీ మమ్మీకి కోడలు వస్తుందని చెప్పు - పబ్లిక్‌గా 'జబర్దస్త్' వర్ష పెళ్లి ప్రపోజల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)