News
News
X

Mega154: 'వైజాగ్ రంగరాజు'గా రవితేజ - చిరు సినిమాలో మాస్ క్యారెక్టర్!

మెగా154 సినిమాలో రవితేజ ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారనే విషయంపై ఓ న్యూస్ బయటకొచ్చింది.   

FOLLOW US: 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), దర్శకుడు బాబీ(Bobby) కాంబినేషన్ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరికొంతమంది స్టార్స్ ను తీసుకున్నారు. నటుడు రవితేజ కీలకపాత్రలో కనిపించనున్నారు. 

సినిమాలో రవితేజ ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారనే విషయంపై ఓ న్యూస్ బయటకొచ్చింది. కథ ప్రకారం సినిమాలో రవితేజ పేరు వైజాగ్ రంగరాజు. అవుట్ అండ్ అవుట్ మాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు రవితేజ. సినిమాలో అతడి రోల్ ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారట దర్శకుడు బాబీ. చిరంజీవి.. వాల్తేర్ వీరయ్య అనే పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో రవితేజ.. చిరుకి తమ్ముడిగా కనిపించబోతున్నారు. 

ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్సమెంట్ లేదు. కానీ రవితేజ పోలీస్ క్యారెక్టర్స్ లో ఓ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తుంటారు. ఈసారి కూడా ఆయన రెచ్చిపోయారని టాక్. దీంతో ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస ప్లాప్స్ తో డీలా పడ్డ రవితేజకి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి!

ఇక రవితేజ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం 'ధమాకా' అనే సినిమాలో నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో రవితేజ రెండు డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్నారు. హీరో క్యారెక్టర్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడి ఉంటుందని.. ఈ క్యారెక్టర్ చుట్టూనే సినిమా కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఓ కంపెనీకి సీఈవోగా కనిపించే రవితేజ.. మరోవైపు ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా కూడా కనిపిస్తాడట. అయితే కంపెనీ సీఈవో అనుకొని పొరపాటున మిడిల్ క్లాస్ వ్యక్తిని రౌడీలు కిడ్నాప్ చేయడం అనేదే ఈ సినిమాలో అసలు ట్విస్ట్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

News Reels

ఈ సినిమాలో 'పెళ్లి సందడి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల.. రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా..కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. 

రవితేజ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్:
ఈ సినిమాతో పాటు 'రావణాసుర', 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' సినిమాల్లో నటిస్తున్నారు రవితేజ. 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక 'రావణాసుర' సినిమాను యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ గా రూపొందిస్తున్నారు. ఇందులో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. 

Also Read : 'క్రేజీ ఫెలో' రివ్యూ : ఆది సాయి కుమార్ సినిమా క్రేజీగా ఉందా? బోర్ కొట్టించిందా?

Published at : 14 Oct 2022 03:55 PM (IST) Tags: Bobby Ravi Teja Mega 154 Chiranjeevi

సంబంధిత కథనాలు

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Prabhas Kriti Sanon: ప్రభాస్ ప్రేమలో కృతి సనన్ - గుట్టురట్టు చేసిన వరుణ్ ధావన్, ఆందోళనలో అనుష్క ఫ్యాన్స్!

Prabhas Kriti Sanon: ప్రభాస్ ప్రేమలో కృతి సనన్ - గుట్టురట్టు చేసిన వరుణ్ ధావన్, ఆందోళనలో అనుష్క ఫ్యాన్స్!

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్

Gautham Karthik-Manjima Mohan Marriage: కోలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి సందడి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన గౌతమ్, మంజిమా

Gautham Karthik-Manjima Mohan Marriage: కోలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి సందడి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన గౌతమ్, మంజిమా

Pavitra Lokesh: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

Pavitra Lokesh: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు -  విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!