By: ABP Desam | Updated at : 06 May 2023 12:01 PM (IST)
Edited By: anjibabuchittimalla
‘హరిహర వీరమల్లు’ షూటింగ్ (Photo Credit: Krish Jagarlamudi/Instagram
వపర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరెక్కుతున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. హిస్టారికల్ యాక్షన్ చిత్రంగా రూపు దిద్దుకుంటోంది. షూటింగ్ ఎండింగ్ కు వచ్చింది. సుమారు 20 శాతం షూటింగ్ మిగిలి ఉంది. పవన్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో క్రిష్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యారు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కంప్లీట్ చేయడానికి సుమారు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ ఇటీవలే ముంబైలో కంప్లీట్ అయ్యింది. రెండో షెడ్యూల్ పుణెలోని ప్రకృతి అందాల నడుమ షూటింగ్ కొనసాగుతోంది. సినిమాలోని పాటల చిత్రీకరణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ‘ఓజీ’ తొలి షెడ్యూల్ కాగానే, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెండో షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొనాలి. కానీ, అనుకోకుండా ‘ఓజీ’ రెండో షెడ్యూల్ కు పవన్ ఓకే చెప్పడంతో షూటింగ్ కొనసాగుతోంది. అటు ఉస్తాద్ భగత్ సింగ్’ తదుపరి షెడ్యూల్ కోసం దర్శకుడు హరీష్ శంకర్ సినిమా తరుపరి షెడ్యూల్ లొకేషన్స్ పరిశీలిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, డీఓపీ బోస్ తో హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు.
నిజానికి ‘హరిహర వీరమల్లు’ సినిమాతో పోల్చితే ఈ రెండు సినిమాలకి కాల్ షీట్స్ చాలా తక్కువగా ఇస్తున్నారు. అందుకే, వేగంగా ఈ రెండు సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసే పనిలోపడ్డారు. కొద్ది రోజుల పాటు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ని హోల్డ్ లో పెట్టారు పవన్ కల్యాణ్. అయితే, పవన్ ఓకే చెప్పగానే ఫైనల్ షెడ్యూల్ ఏమాత్రం సమయం వృథా చేయకుండా కంప్లీట్ చేయాలని క్రిష్ భావిస్తున్నారట. అందుకోసం పకడ్బందీ ఫ్లాన్స్ వేసుకుంటున్నారట. ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ సినిమాలు కంప్లీట్ అయితే పూర్తిస్థాయిలో ‘హరిహర వీరమల్లు’పై పవన్ ఫోకస్ పెట్టనున్నారు. నిజానికి ఈ చిత్రం పీరియాడికల్ జోనర్ లో రూపొందుతుందట. పవన్ ఇప్పటి వరకు చేయని క్యారెక్టరైజేషన్ కావడంతో కాస్త సమయం ఎక్కువ కేటాయించాల్సి వస్తోందట. ఈ కారణంగానే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోందట. ఇప్పటికే ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని క్రిష్ భావిస్తున్నారు. అనుకున్న సమయానికి విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా ఎన్నికలు సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ లోగానే సినిమాలన్నీ కంప్లీట్ చేసుకోవాలని భావిస్తున్నారు.
Read Also: ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై సర్వత్రా నిరసనలు, థియేటర్ల దగ్గర భద్రత పెంచిన పోలీసులు
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Ponniyin Selvan 2 on OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియన్ సెల్వన్ 2' - ఇక నుంచి ఫ్రీగా చూడొచ్చు!
24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా
విడుదలకు ముందే రూ.400 కోట్లు రాబట్టిన ‘ఆదిపురుష్’? - ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
కీర్తి సురేష్‌కు టాలీవుడ్ షాక్ - శ్రీలీలా ఎఫెక్ట్‌తో కోలీవుడ్‌కు జంప్!
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!