By: ABP Desam | Updated at : 05 Sep 2023 10:50 AM (IST)
సాల్వే వెడ్డింగ్ రిసెప్షన్ లో లిత్ మోడీ,ఉజ్వల రౌత్(Photo Credit: Narrative Fixer/twitter)
ప్రముఖ న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు. ఆదివారం (సెప్టెంబర్3) నాడు లండన్‌లో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో 68 ఏండ్ల సాల్వే, త్రినాను వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు నీతా అంబానీ, లలిత్ మోదీ సహా పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. 38 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం జూన్ 2020లో సాల్వే తన మొదటి భార్య మీనాక్షికి విడాకులు ఇచ్చారు. వీరికి సాక్షి, సానియా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. 2020లోనే కరోలిన్ బ్రోస్సార్డ్ ను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెతోనూ కొద్ది నెలల తర్వాత విడాకులు తీసుకున్నారు. తాజాగా మూడో పెళ్లి చేసుకున్నారు.
సాల్వే పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, వీటిలో లలిత్ మోడీ, తొలి ఇండియన్ సూపర్ మోడల్ ఉజ్వల రౌత్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రముఖ నటి సుష్మితా సేన్ తో ప్రేమాయణం నడిపిన లలిత్ మోడీ, కొద్ది కాలం క్రితం ఆమెకు బ్రేకప్ చెప్పారు. ప్రస్తుతం ఉజ్వల తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
So, Lalit Modi is Lawyer Harish Salve's one of friends. Lalit Modi and his girlfriend and model Ujjwala Raut at the wedding. https://t.co/0nOitOrAhr pic.twitter.com/W7eJKWIyrG
— Narrative Fixer (@LtlBud) September 4, 2023
1978లో జన్మించిన ఉజ్వల రౌత్ 90వ దశకంలో భారతీయ ఫ్యాషన్ రంగంలో సత్తా చాటారు. తొలి ఇండియన్ సూపర్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉజ్వల తండ్రి ముంబై పోలీస్ డిప్యూటీ కమిషనర్ గా పని చేశారు. ఆమె కాలేజీ డేస్ నుంచే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. 17 ఏళ్ల వయసులోనే 1996లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో ఆమె ఫెమినా లుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. అదే సంవత్సరం, ఫ్రాన్స్ లో జరిగిన ఎలైట్ మోడల్ లుక్ పోటీలో ఆమె టాప్ 15లో చోటు దక్కించుకుంది. 90వ దశకం చివరి నాటికి, ఉజ్వల దేశంలోని టాప్ మోడల్స్లో ఒకరుగా ఎదిగారు. ఆమె పలు అంతర్జాతీయ డిజైనర్లు లేబుల్స్ కోసం ర్యాంప్ వాక్ చేశారు. 2002, 2003లో రెండుసార్లు విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షో కోసం ర్యాంప్ వాక్ చేసిన తొలి భారతీయ మోడల్ గా నిలిచింది. 2012లో MTV సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్‌లో మిలింద్ సోమన్‌తో కలిసి న్యాయనిర్ణేతగా కనిపించింది.
జూన్ 2004లో ఉజ్వల రౌత్ స్కాటిష్ చిత్ర నిర్మాత మాక్స్ వెల్ స్టెరీని వివాహం చేసుకుంది. పలు సమస్యలతో ఈ జంట 2011లో విడాకులు తీసుకుంది. వీరికి అప్పటికే క్ష అనే కుమార్తె ఉంది. అయితే, కూతురు తనకంటే తనకు చెందాలంటూ భార్య భర్తలు కోర్టులో కేసు వేశారు. ఇప్పటికీ ఆ కేసు అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఉజ్వల దగ్గరే పెరుగుతోంది. ఇప్పుడు ఉజ్వల లలిత్ మోడీతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Read Also: ‘జవాన్‘ విడుదలకు ముందు తిరుమలకు షారుఖ్ - హిట్ కావాలని కోరుతూ టీమ్ & ఫ్యామిలీతో
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్
Brahmamudi September 28th: కనకమా మజాకా, స్వప్న సేఫ్- అమ్మాకొడుక్కి అదిరిపోయే షాక్!
Guppedanta Manasu September 28th: KGF బ్యాంగ్రౌండ్ తో పిండేశారు, అమ్మా అని పిలిచిన రిషి - శైలేంద్ర దొరికిపోతాడా
Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం
Bigg Boss Season 7 Day 23 Updates: శుభశ్రీ మీద మీదకు వచ్చిన శివాజీ - టచ్ చేయొద్దంటూ వార్నింగ్
TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?
Breaking News Live Telugu Updates: బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్ విల్లా లడ్డూ
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన
/body>