Laatti Trailer: లాఠీ స్పెషలిస్ట్‌గా విశాల్ - డిసెంబర్ 22న చార్జ్‌కు రెడీ - యాక్షన్ ఎపిసోడ్స్‌తో అదరగొట్టిన ట్రైలర్!
విశాల్ లేటెస్ట్ సినిమా ‘లాఠీ’ ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న కోలీవుడ్ హీరో విశాల్. తన లేటెస్ట్ సినిమా ‘లాఠీ’. ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. లాఠీ స్పెషలిస్ట్ మురళిగా విశాల్ ఇందులో కనిపించనున్నాడు. ఎంతటి కరుడుగట్టిన క్రిమినల్‌తో అయినా తన లాఠీతో నిజం చెప్పించే పాత్రలో విశాల్‌ను చూపించారు.
కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఒక బిల్డింగ్‌లో వందల మంది రౌడీలతో విశాల్ చేసే ఫైట్ సినిమాకి హైలెట్‌గా ఉండనున్నట్లు కనిపిస్తుంది. 2018లో వచ్చిన ‘అభిమన్యుడు’ తర్వాత విశాల్‌కు ఇంతవరకు హిట్ దక్కలేదు. వరుసగా ఆరు సినిమాలు బోల్తా కొట్టేశాయి. కాబట్టి ‘లాఠీ’ ఎలాగైనా హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
‘లాఠీ’ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ రెండు సార్లు గాయపడ్డారు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరిగిన సమయంలో ఒకసారి గాయపడ్డారు. చెన్నైలో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నప్పుడు మరోసారి ప్రమాదానికి గురయ్యారు. ఆయన కాలుకి బాగా దెబ్బ తగిలింది. దీంతో షూటింగ్ ని నిలిపివేశారు. గతంతో పోలిస్తే ఈ సారి గాయాలు తీవ్రం గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్ ప్రారంభించనునట్లు చిత్ర బృందం వెల్లడించింది. గతంలో ప్రమాదం జరినప్పుడు ఆయన కేరళ వెళ్ళి దాదాపు మూడు వారాల పాటు చికిత్స తీసుకుని వచ్చారు. విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం విశాల్ చేతిలో ‘మార్క్ ఆంటోని’ అనే సినిమా కూడా ఉంది. ఇందులో విశాల్, ఎస్‌జే సూర్య డ్యూయల్ రోల్స్‌లో కనిపించనున్నారు. రీతూ వర్మ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం.
View this post on Instagram
View this post on Instagram