జోరు వాన, అందమైన లోకేషన్లలో ‘కృష్ణ వింద విహారి’ షూటింగ్, ఆకట్టుకుంటున్న షెర్లీ సేతియా Vlog
నాగశౌర్య, సేతియా కలిసి నటించిన తాజా సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. ఫన్ బాగానే ఉన్నా.. బలమైన కథనం లేకపోవడంతో ఫర్వాలేదు అనిపించింది. తాజాగా ఈ సినిమా వ్లోగ్ ను విడుదల చేసింది షెర్లీ సేతియా.
![జోరు వాన, అందమైన లోకేషన్లలో ‘కృష్ణ వింద విహారి’ షూటింగ్, ఆకట్టుకుంటున్న షెర్లీ సేతియా Vlog Krishna Vrinda Vihari (Behind The Scenes) | Shirley Setia Vlog జోరు వాన, అందమైన లోకేషన్లలో ‘కృష్ణ వింద విహారి’ షూటింగ్, ఆకట్టుకుంటున్న షెర్లీ సేతియా Vlog](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/04/9e71a3a772bb9ea9b6f47c8f56e52c5e1664860389469239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యంగ్ హీరో నాగ శౌర్య వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. రీసెంట్ గా ‘అశ్వథ్ధామ’, ‘వరుడు కావలెను’ తో పాటు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ‘లక్ష్య’ సినిమాలతో జనాలను బాగానే అలరించారు. తాజాగా ఈ యువ హీరో నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. షెర్లీ సేతియాతో కలిసి చేసిన ఈ సినిమా తన కెరీర్ లో 22వ చిత్రంగా తెరెక్కింది. నాగశౌర్య తండ్రి ప్రసాద్ ముల్పూరి సమర్పణలో, హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో తల్లి ఉషా ముల్పూరి నిర్మించారు. ‘అలా ఎలా’, ‘లవర్’, ‘గాలి సంపత్’ చిత్రాల దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.
తాజాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. సంప్రదాయ అబ్బాయికి, మోడ్రన్ అమ్మాయికి మధ్య ప్రేమ, కుటుంబ సంస్కృతులు, సంప్రదాయాల కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నిజానికి ఈ సినిమాలో మంచి స్టోరీ పాయింట్ ఉంది. కావాల్సినంత ఫన్ ఉంది. బలమైన కథనం లేకపోవడం మైనస్. వీక్ కథ కారణంగా సినిమా ఎక్కడికో వెళ్లాల్సినా.. జస్ట్ ఓకే అనే స్థాయికి చేరింది. ఇలాంటి కథలు గతంలోనే అనేకం చూశాం. అందుకే జనాలకు పెద్దగా ఎక్కదు. మొత్తంగా ఈ సినిమా జస్ట్ ఎంటర్ టైన్ కావొచ్చు అనిపించింది. వాస్తవానికి నాగశౌర్యకు చాలా టాలెంట్ ఉన్నా.. మంచి కథలతో సినిమాలు వచ్చినా కమర్షియల్‌గా గట్టి హిట్ మాత్రం తగల్లేదని చెప్పుకోవచ్చు.
ఈ సినిమా ఎలా ఉంది? అనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఫన్ ను తన కెమెరాలో బంధించింది హీరోయిన్ షెర్లీ సేతియా. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను తన వ్లోగ్ ద్వారా విడుదల చేసింది. అందమైన మంచు కొండలు, ప్రకృతి రమణీయతకు నిదర్శనం అయిన కాఫీ తోటల్లో వర్షపు చినుకులు కురస్తుండగా షూటింగ్ జరిగే తీరు ఆకట్టుకుంది. సినిమా యూనిట్ తో కలిసి హీరో, హీరోయిన్ చేసిన ఫన్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. డ్యాన్స్ ప్రాక్టీస్, మేకప్ రూమ్ ముచ్చట్లు, హీరో హీరోయిన్ల మధ్య సీన్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. తన పెట్ డాగ్ తో ఆడుకునే ఆటలు, సెట్ బాయ్స్ నుంచి డైరెక్టర్ వరకు అందరితో సరదా సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సీన్లను చూస్తుంటే సినిమా షూటింగ్ అంతా ఎంతో హ్యాపీగా, జాలీగా జరిగినట్లు తెలుస్తున్నది. షెర్లీ అప్ లోడ్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. పెద్ద సంఖ్యలో వ్యూస్ తో పాటు కామెంట్స్ వస్తున్నాయి.
My Krishna Vrinda Vihari Vlog is finally out! Hope you all like it🌹
— Shirley Setia (@ShirleySetia) October 3, 2022
If you haven’t yet seen the film- do watch it with your family and friends. Tickets are out on Book My Show. @IamNagashaurya @ShirleySetia #AnishKrishna @ira_creations https://t.co/pR7qB5IzgT
Also Read : 'గాడ్ ఫాదర్' ఫ్లాప్ అంటుంటే హ్యాపీగా మెగా ఫ్యాన్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)