News
News
వీడియోలు ఆటలు
X

Krishna Mukunda Murari April 19th: క్షణక్షణం ఉత్కంఠభరితం- కృష్ణ, భవానీలో గెలుపు ఎవరిది? మురారీ ఎవరికిచ్చిన మాట నిలబెట్టుకుంటాడు

నందిని పెళ్లి చేయాలని అటు కృష్ణ, ఇటు భవానీ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రయత్నాలు చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.

FOLLOW US: 
Share:

మురారీకి కృష్ణ అసలు విషయం చెప్పడంతో ఎవరికి ఇచ్చిన మాట నెరవేర్చాలో అర్థం కాక డైలమాలో పడిపోతాడు. కృష్ణ కలవరిస్తూ ఉండేసరికి రేవతి వచ్చి ఏం చేస్తున్నావని సీరియస్ అవుతుంది. అసలు ఏమనుకుంటున్నావ్ మురారీ కి దూరం అవుదామని అనుకుంటున్నావా? నందిని ఈ ఇంటి ఆడపిల్ల తనకి లేని రక్షణ బయట నుంచి వచ్చిన నీకు ఎలా ఉంటుందని అనుకుంటున్నావ్. ఏవైణి ఎదిరిస్తున్నావో అర్థం అవుతుందా? అని బాధగా నిలదీస్తుంది. ఇది పులి మేక ఆట లాంటిదని భయపెడుతుంది. సమస్యలు రాకముందే తప్పుకోమని సలహా ఇస్తుంది.

రేవతి: నువ్వు చేసే పనుల వల్ల మురారీకి నీకు మధ్య సమస్యలు వస్తాయి

కృష్ణ: ఏసీపీ సర్ కి నాకు మధ్య ఎటువంటి మనస్పర్థలు రావు. పెద్దత్తయ్యకి ఏసీపీ సార్ కి మధ్య గొడవలు రాకుండా నేను చూసుకుంటాను. నాకు ఏం కాదు అవన్నీ నేను చూసుకుంటాను

Also Read: వేద జీవితాన్ని నిలబెట్టిన విన్నీ, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న యష్- మాళవికని వెర్రిదాన్ని చేసిన అభిమన్యు

రేవతి: వాడు నందిని పెళ్లి చేస్తానని పెద్దమ్మకి మాట ఇచ్చాడు

ఏసీపీ సర్ కి వాళ్ళ పెద్దమ్మ ముఖ్యమైన పని అప్పగించారంటే అది నందిని పెళ్లి అన్నమాట నాకు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పెళ్లి వల్ల పెద్దత్తయ్యకి ఆయనకి మధ్య మనస్పర్థలు వస్తాయేమోనని కృష్ణ భయపడుతుంది. భవానీ, ఈశ్వర్ మాట్లాడుకుంటూ ఉండగా రేవతి వచ్చి మధ్యలో కల్పించుకుంటుంది. ఎవరికైనా ఏదైనా సమస్య ఏం జరుగుతుంది అంతా కలిసి నన్ను పరాయి దాన్ని చేస్తున్నారని ఆత్రంగా అడుగుతుంది. బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటున్నామని భవానీ అబద్ధం చెప్తుంది. అసలు నువ్వు ఈ టైమ్ లో పైకి ఎందుకు వెళ్ళావని నేను ఎక్కడ అడుగుతానోనని ముందుగానే నువ్వు ఇన్ని ప్రశ్నలు వేశావా అని గాలి తీసేస్తుంది.

మురారీ పెద్దమ్మ, కృష్ణకి ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకే రోజు ఒకే ముహూర్తం నందినిని ఎవరికి ఇచ్చి చేయాలి. మాట తప్పి నందిని కిరణ్ కి ఇచ్చి చేస్తే కృష్ణ ఇంట్లో ఉంటుందా? ఒకవేళ గౌతమ్ కి ఇచ్చి చేస్తే పెద్దమ్మ కృష్ణని ఇంట్లో నుంచి పంపించేస్తుందా? రెండింటి వల్ల కృష్ణ నాకు దూరం అవుతుందేమోనని మురారీ బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణ వచ్చి మురారీని పలకరిస్తుంది. నందిని పెళ్లి గౌతమ్ తో జరగడం వల్ల వచ్చే సమస్యలను నా భుజాల మీద వేసుకుంటానని మురారీకి ధైర్యం చెప్తుంది. మీ దగ్గర మాట తీసుకునే ముందు నందిని గురించి చెప్పి ఉండాల్సింది. మీ మీద నేను ఈగ కూడా వాలనివ్వను. మీ పెద్దమ్మకి మీకు మధ్య బంధం చెడిపోయేలా చేయనని కృష్ణ మాట ఇస్తుంది. తెల్లారి భవానీ, కృష్ణ దేవుడి ముందు దణ్ణం పెట్టుకుంటూ పోట్లాడుకుంటారు. ఇద్దరూ ఒకరికొకరు తాము చేసేది కరెక్ట్ అనేలా మాట్లాడుకుంటారు. పెళ్ళికి ఏర్పాట్లు చేసి భవానీ వాళ్ళు రేవతి, కృష్ణకి తప్ప మిగతా వారికి చెప్పకుండా  మండపానికి వెళతారు.

Also Read: మురారీకి నిజం చెప్పిన కృష్ణ - గౌతమ్ పెళ్లి నందినితో జరుగుతుందా?

Published at : 19 Apr 2023 11:34 AM (IST) Tags: Krishna Mukunda Murari Serial Krishna Mukunda Murari Serial Today Episode Krishna Mukunda Murari Serial Written Update Krishna Mukunda Murari Serial April 19th Episode

సంబంధిత కథనాలు

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ