(Source: ECI/ABP News/ABP Majha)
Krishna Mukunda Murari April 12th: భవానీ వాళ్ళ మీద అనుమానపడిన ముకుంద- మురారీకి షాకిచ్చిన కృష్ణ
నందు పెళ్లి గౌతమ్ తో చేయాలని కృష్ణభవానీకి ఎదురుతిరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఎట్టి పరిస్థితుల్లో నందుకి నయం అయ్యేలా చేస్తానని భవానీకి ధీటుగా కృష్ణ సమాధానం చెప్తుంది. అది విని ముకుంద మీరేమైన ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నారా అంటుంది కానీ కృష్ణ మాత్రం బెదరకుండా మాట్లాడి వెళ్ళిపోతుంది. అదంతా చూసి ముకుందకి అనుమానం కలుగుతుంది. గౌతమ్ పెళ్లి ఆదివారం చేస్తానని మాట ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటాడు. అటు పెద్దమ్మ పెట్టించిన పెళ్లి ఇది రెండూ ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణకి, పెద్దమ్మకి ఇచ్చిన మాట తప్పకూడదని అనుకుని ఇటు తిరిగేసరికి కృష్ణని ఢీ కొడతాడు. కృష్ణ కింద పడిపోతుంది. దెయ్యం పట్టిన దానిలాగా కృష్ణ నటిస్తుంది. అది నమ్మని మురారి కాసేపు కామెడీ చేస్తాడు. భయం లేదా దెయ్యంతోనే పరాచకాలు ఆడుతున్నావా అని కృష్ణ అనేసరికి మురారి తనని ఎత్తుకుని మంచం మీద పడేస్తాడు.
Also Read: భర్త చేతికి సంకెళ్ళు వేసి అరెస్ట్ చేసిన జానకి- మనోహర్ ప్లాన్ ని తిప్పికొడుతుందా?
నేను భయపెడుతుంటే మీరు ఎందుకు భయపడలేదని బుంగమూతి పెడుతుంది. చిన్న పిల్ల నాతో ఆడుతున్నట్టు ఉందని మురారి మెచ్చుకుంటాడు. ఇంత అందమైన మొహం దెయ్యం పట్టిందంటే ఎలా నమ్ముతానని అంటాడు. ఇద్దరూ కాసేపు నవ్వుకుంటారు. మంచం మీద పడేయడంతో కృష్ణ నడుము పట్టేస్తుంది. కృష్ణ నడవలేక పడిపోతుంటే మురారి పట్టుకుంటాడు కాసేపు ఇద్దరి మధ్య రొమాన్స్ నడుస్తోంది. భార్యని పట్టుకుని చిన్నగా నడిపిస్తాడు. నేను ఇక మెట్లు దిగలేనా చెంగు చెంగునా గెంతలేనా అని బిక్క మొహం వేసేస్తుంది. తనని బెడ్ మీద పడుకోబెట్టి మమ్మీని పంపిస్తానని చెప్తాడు. మురారీ అటు వెళ్ళగానే కృష్ణ లేచి తీన్మార్ డాన్స్ వేస్తుంది అది చూసి దెయ్యం అంటే భయపడలేదని ఇలా చేస్తావా అని తన వెంట పరుగులు పెడతాడు. కాసేపటికి పెద్దమ్మ అప్పజెప్పిన పని గురించి మాట్లాడాలని వెళ్ళిపోతాడు. అసలు పెద్దత్తయ్య ఏం పని అప్పగించారా అని కృష్ణ ఆలోచిస్తుంది.
భవానీ వాళ్ళు మురారీ గురించి మాట్లాడుకుంటారు. ఈ మధ్య మురారీ దేని గురించో టెన్షన్ పడుతున్నాడని భవానీ అంటుంది. కృష్ణ ఎంత ధైర్యంగా ఉందో చూశారా? అని మాట్లాడుకుంటూ ఉండగా మురారి వస్తాడు. కృష్ణ ఆపరేషన్ సక్సెస్ చేస్తానని అంటే వీళ్ళు ఎందుకు ఇంత భయపడుతున్నారని ముకుంద అనుమానపడుతుంది. దేని గురించి టెన్షన్ పడుతున్నావ్ అని అడుగుతారు. నందు పెళ్లి ఆదివారం అనుకున్నారు కదా ఏ టైమ్ అని అడుగుతాడు. మధ్యాహ్నం పెట్టుకున్నాం కరెక్ట్ గా ఒంటి గంటకని చెప్తాడు. మురారీ మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడని ఈశ్వర్ చెప్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ముకుంద వచ్చి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని అంటుంది. సమయం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయని భవానీ చెప్తుంది. జస్ట్ పెళ్లి పనుల్లో మురారీకి హెల్ప్ గా ఉండమని అంటుంది. నందిని పెళ్లి విషయం రేవతి, కృష్ణ, నందినికి తెలియకుండా ఉంచాలని భవానీ మరోసారి చెప్తుంది.
Also Read: తులసి ఇంట్లో సంబరంగా మొదలైన పెళ్లి పనులు- దివ్యకి ఫోన్ చేసిన ప్రియ
నందిని పెళ్లి అంటే అందరి కంటే కృష్ణ ఎక్కువగా సంతోషపడుతుంది కదా మరి అలాంటిది తనకే తెలియకూడదని అంటారు ఏంటని ఆలోచిస్తుంది. మురారీ గదిలోకి వచ్చి ఒక చిక్కు వచ్చి పడిందని అంటాడు. గౌతమ్ సర్ కి ఒక మాట ఇచ్చాను ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేక పోతున్నానని మురారీ చెప్పేసరికి కృష్ణ షాక్ అవుతుంది. ఆరోజు చాలా పెద్ద పని ఉందని మురారీ అబద్ధం చెప్తాడు. మీరు అందరిలాగే మాట తప్పుతున్నారని కృష్ణ చిందులేస్తుంది. ఊరికే ఆటపట్టించానని అంటాడు. తర్వాత గౌతమ్ పెళ్లి ఏ టైమ్ కి అనేసరికి కృష్ణ కూడా ఆదివారం ఒంటి గంటకని చెప్పేసరికి మురారీ బిత్తరపోతాడు.