News
News
X

ఆ సినిమాలో నటించనని చెట్టెక్కి కూర్చున్నాడు - మహేష్ బాబు గురించి కృష్ణ చివరి మాటలు

టాలీవుడ్‌కు అరుదైన సేవలు అందించడమే కాదు.. మహేష్ బాబు రూపంలో చక్కని వారసుడిని ఇండస్ట్రీకి అందించారు కృష్ణ. నేటి సూపర్ స్టార్ గురించి.. నాటి సూపర్ స్టార్ తన చివరి ఇంటర్వ్యూలో ఏం చెప్పారో తెలుసా?

FOLLOW US: 

సూపర్ స్టార్ కృష్ణ.. టాలీవుడ్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. ఇప్పుడు ఆయన వారసుడు మహేష్ బాబు సైతం సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి టాలీవుడ్‌‌ను ఏలుతున్న సంగతి తెలిసిందే. కొడుకు తన పేరును నిలబెట్టే స్థాయికి ఎదిగాడంటే.. ఏ తండ్రికైనా తప్పకుండా గర్వం ఉంటుంది. సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణ సైతం మహేష్ బాబు సక్సెస్‌ను చూసి ఎంతో గర్వపడ్డారు. 2022, మే 31న పుట్టిన రోజు సందర్భంగా కృష్ణ.. ఆయన కుమార్తె మంజుల ఘట్టమనేనికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఇదే ఆయన చివరి ఇంటర్వ్యూ.. మహేష్ బాబు గురించి ప్రజలకు చెప్పిన చివరి మాటలు కూడా!

కోడి రామకృష్ణ ప్రోత్సాహంతో..

‘‘మహేష్ బాబును హీరోగా చేయాలని చిన్నప్పుడే ప్లాన్ చేశారా? కావాలనే బాల్యంలో మహేష్ బాబుతో సినిమాలు తీశారా?’’ అని మంజుల ప్రశ్నించారు. ఇందుకు కృష్ణ సమాధానమిస్తూ.. ‘‘మహేష్ బాబుతో సినిమాలు తీయాలనే ప్లాన్ ఏదీ లేదు. అయితే, ఒక రోజు నాతోపాటు షూటింగ్‌కు వచ్చాడు. మెట్ల మీద కూర్చొని శ్రద్ధగా చూస్తున్నాడు. అప్పుడు కోడి రామకృష్ణ మహేష్ బాబును చూసి ఎవరా అబ్బాయి అని అడిగారు. దీంతో సెట్‌లో ఉన్నవారు కృష్ణగారి అబ్బాయని చెప్పారు. దీంతో ఆయన మా సినిమాలో చేస్తావా అని అడిగారు. నేను సినిమాలు చేయను అంటూ స్టూడియో చుట్టూ పరుగులు పెట్టాడు. అప్పట్లో మన ఇంటి పక్కన ఉండే రామచంద్ర ఆ సినిమాకు కో-డైరెక్టర్. అతడు మహేష్‌కు ఏం చెప్పారో ఏమో.. సినిమాకు ఒప్పుకున్నాడు’’ అని కృష్ణ తెలిపారు. ‘‘మహేష్ బాబు ‘పోకిరి’ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడే చెప్పా. అది ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని. ‘దూకుడు’ కూడా మహేష్‌తో కలిసి చూశా. ఆ రెండూ ఇప్పుడు ల్యాండ్ మార్కులు అయ్యాయి’’ అని పేర్కొన్నారు. 

మహేష్ బాబు గురించి డూండీ అప్పుడే చెప్పారు

‘పోరాటం’ ప్రివ్యూ చూసేందుకు ప్రముఖ దర్శకుడు, నిర్మాత పోతిన డూండీశ్వరరావు(డూండీ) వచ్చారు. ఆ పిల్లాడు ఎవరో బాగా చేశాడు. పెద్ద స్టార్ అవుతాడు. చాలా బాగా యాక్ట్ చేశాడు. అంత చిన్న వయస్సులోనే అతడిలో ఈజ్ ఉంది’’ అని తెలిపారని కృష్ణ తెలిపారు. ఇదే విషయాన్ని దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘సినిమాలు చేస్తేవా అంటే మహేష్ బాబు చేయను అన్నాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. ఎందుకు చేయవూ అంటే సినిమాల్లో చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి కదా మనం. మా నాన్నగారిని చూస్తున్నాను కదా. చిన్నప్పుడు మహేష్ బాబులో ఆ అవగాహన గమనించాం. నువ్వు మీ నాన్నగారిలా ఉంటావు. భవిష్యత్తులో ఆయన పేరు నిలబెట్టాలంటే నువ్వు కూడా నటించాలని చెప్పాను. దీంతో ఆ సినిమా(పోరాటం)లో కృష్ణగారికి తమ్ముడిలా నటించాడు’’ అని అన్నారు.

Published at : 15 Nov 2022 10:34 AM (IST) Tags: Krishna About Mahesh Babu Mahesh Babu Father Death Krishna Death Mahesh Babu Father Passes Away Mahesh Babu Father Krishna Mahesh Babu

సంబంధిత కథనాలు

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

18 pages movie song: మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా - శింబుతో బలవంతంగా పాట పాడించిన నిఖిల్, ఈ వీడియో చూశారా?

18 pages movie song: మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా - శింబుతో బలవంతంగా పాట పాడించిన నిఖిల్, ఈ వీడియో చూశారా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

టాప్ స్టోరీస్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

YS Sharmila : లోటస్ పాండ్ టు ఎస్‌ఆర్ నగర్‌ పోలీస్ స్టేషన్ వయా సోమాజిగూడ - షర్మిల అరెస్ట్ ఎపిసోడ్‌లో క్షణక్షణం ఏం జరిగిందంటే ?

YS Sharmila :  లోటస్ పాండ్ టు ఎస్‌ఆర్ నగర్‌ పోలీస్ స్టేషన్ వయా సోమాజిగూడ - షర్మిల అరెస్ట్ ఎపిసోడ్‌లో క్షణక్షణం ఏం జరిగిందంటే ?