నాన్నా, నీలోటు పూడ్చలేనిది! సూపర్ స్టార్ కృష్ణకు కుమార్తె మంజుల భావోద్వేగ నివాళి!
ప్రముఖ నటుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన కూతురు మంజుల సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ నివాళి అర్పించారు.
ప్రముఖ టాలీవుడ్ నటుడు కృష్ణ మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణం అనంతరం కూమార్తె మంజుల ఘట్టమనేని సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ నివాళి అర్పించారు. ఆయన మరణం ఎప్పటికీ పూడ్చలేని నష్టంగా అభివర్ణించారు. కృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఆర్వాత.. తండ్రితో కలిసి ఉన్న ఫోటో పెట్టి ‘డియరెస్ట్ నాన్నా’ అంటూ తన బాధను అక్షరాల రూపంలో వ్యక్తం చేశారు.
తండ్రి మంజుల భావోద్వేగ నివాళి!
“మీరు ప్రపంచానికి సూపర్ స్టార్ కావొచ్చు. కానీ, ఇంట్లో మీరు ప్రేమగల, సాదాసీదా తండ్రివి. నువ్వు మా కోసం కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నావు. మీ బిజీ షెడ్యూల్‌లలో కూడా.. మీరు మాకు కావాల్సినవన్నీ అందించారు. మా కోసం ఎప్పుడూ గడిపేందుకు ప్రయత్నించే వాడివి. జీవితాన్ని ఎలా జీవించాలో మీరు మాకు ఎప్పుడూ ఉపన్యాసాలు ఇవ్వలేదు. మీరు, మీ పనుల ద్వారానే అ విషయాలను మాకు నేర్పారు. మీ సరళత, సౌమ్యత, వివేకం, క్రమశిక్షణ, సమయపాలన, దాతృత్వం అసమానమైనవి. సినిమాకి మీ వారసత్వం అపారమైన సహకారం శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటుంది” అని మంజుల వెల్లడించింది.
“నువ్వే నా బలం, నువ్వే నాకు వెన్నెముక, నువ్వే నా హీరో. నీ ప్రేమ అంతులేని సముద్రం. మాకు అవసరమని మాకు తెలియనప్పుడు కూడా మీరు మాకు కావాల్సినవన్నీ ఇచ్చారు. మేము ఇకపై మిమ్మల్ని చాలా మిస్ అవుతాము. నేను ఉదయం మీకు చేసే కాల్స్, కలిసి భోజనాలు చేయడం, కలిసి మాట్లాడుకోవడం సహా చాలా విషయాలను కోల్పోతున్నాం. మీ నష్టాన్ని మేం ఎప్పటికీ పూర్తి చేసుకోలేం. లవ్ యు ఫరెవర్ నాన్నా” అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.
View this post on Instagram
80 ఏండ్ల వయసులో కృష్ణ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు మరణించారు. కృష్ణ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఐదు దశాబ్దాల పాటు తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. 1965లో ‘తేనే మనసులు’ చిత్రంలో అరంగేట్రం చేసిన కృష్ణ 350కి పైగా చిత్రాలలో నటించారు. సాక్షి, పండంటి కాపురం, గూడాచారి 116, జేమ్స్ బాండ్ 777, ఏజెంట్ గోపి లాంటి ఎన్నో అద్భుత సినిమాల్లో నటించారు.
కృష్ణకు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు
ఇక కృష్ణ పర్సనల్ విషయాల్లోకి వస్తే కృష్ణకు ఇందిరతో తొలి వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం.. మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. ఆ తర్వాత సినిమాలు తీస్తున్న క్రమంలో విజయ నిర్మలతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. ఈ ఏడాది సెప్టెంబర్ లో కృష్ణ మొదటి భార్య ఇందిర కన్నుమూశారు.
Read Also: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యులు కీలక మార్పులు