Anushka Shetty : అబ్బాయి ప్రపోజల్ కి భయపడిన అనుష్క!
జనాలతో 'జేజమ్మా' అని ముద్దుగా పిలిపించుకుంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనుష్క గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం
సినిమాలో హీరోయిన్ అంటే.. కాసేపు హీరోతో రొమాన్స్ చేయడానికి, పాటల్లో డాన్స్ చేయడానికి మాత్రమే కాదని నిరూపించింది అనుష్క. టాలీవుడ్ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేయగలిగింది. తన భుజాలపై సినిమా మొత్తాన్ని మోస్తూ ఎన్నో హిట్స్ అందుకుంది. జనాలతో 'జేజమ్మా' అని ముద్దుగా పిలిపించుకుంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనుష్క గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!
పూరితో ఫన్నీ ఇన్సిడెంట్..
దర్శకుడు పూరి జగన్నాథ్ 'సూపర్' సినిమాలో నటి కోసం చూస్తున్న సమయంలో స్నేహితుడి ద్వారా అనుష్క గురించి తెలుసుకున్నారు. కానీ అనుష్క మాత్రం భయపడిందట. దీంతో అవాయిడ్ చేస్తూ వచ్చిందట. చివరకు పూరి జగన్నాథ్ ను కలిసినప్పుడు ఆయన ఫోటోస్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే.. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసి ఇచ్చిందట అనుష్క. నిజానికి హీరోయిన్లకు పోర్ట్ ఫోలియో ఒకటి ఉంటుందనే సంగతి కూడా అనుష్కకు తెలియదు. ఆమె అమాయకత్వాన్ని గమనించిన పూరి ఫోటో చూసి నవ్వి ఆమె చేతిలో పెట్టాడట.
అబ్బాయి ప్రపోజ్ చేస్తే భయపడిపోయింది..
అనుష్క ఎంత అందంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఆమెకి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అయితే కాలేజ్ రోజుల్లో ప్రేమిస్తున్నానంటూ ఓ వ్యక్తి అనుష్క వెంట పడేవాడట. ఆ తరువాత గిఫ్ట్ లు తీసుకొస్తూ ఇవ్వడానికి ప్రయత్నించేవాడట. దీంతో భయపడి కొన్నాళ్లపాటు కాలేజీకి వెళ్లలేదని ఓ సందర్భంలో అనుష్క చెప్పింది.
సెట్స్ లో బూతులు తిట్టేవారు..
అనుష్క నటించిన 'అరుంధతి' సినిమాకి నిర్మాతగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి వ్యవహరించారు. అయితే షూటింగ్ లో ఎవరైనా తప్పు చేస్తే ఆయన గట్టిగా అరిచి బూతులు తిట్టేవారట. వాటికి అర్ధం తెలియక.. వెళ్లి ఆయన్నే అడిగేదట అనుష్క. దీంతో అనుష్క ఉన్నప్పుడు ఆయన కాస్త మెల్లగా తిట్టడం చేసేవారట. తిరిగి ఆమెని మీనింగ్ మాత్రం అడగొద్దని చెప్పేవారట.
సోషల్ సర్వీస్ నచ్చదు..
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లంతా తమ పరిధిలో సోషల్ సర్వీస్ చేస్తున్నారు. కానీ అనుష్కకు మాత్రం సోషల్ సర్వీస్ చేయడం నచ్చదట. ఫ్రీగా ఇచ్చేడానికి విలువ ఉండదనేది ఆమె భావం. కానీ ప్యాషన్ తో ఉన్న వాళ్లకి, అవసరం ఉన్న వాళ్లకి సాయం చేయొచ్చని చెబుతోంది.
ఫిషర్ విమెన్ గా కనిపించాలని ఆమె కోరిక..
అనుష్కకు సింపుల్ గా ఉండడమంటే ఇష్టం. హెవీ డ్రెస్ లు, భారీ నగలు వేసుకోవడం నచ్చదు. కానీ తన తల్లి మాత్రం అనుష్కను ఈ విషయంలో ఫోర్స్ చేసేవారు. ఆమెకి అనుష్కను రాణి పాత్రలో చూడాలని కోరిక ఉండేదట. 'రుద్రమదేవి' సినిమాతో ఆమె కోరిక తీరింది. అలానే అనుష్క ఫిషర్ విమెన్ గా కనిపిస్తే చూడాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. మరి ఆ కోరిక తీరుతుందో లేదో!