News
News
వీడియోలు ఆటలు
X

విద్యార్థులకు పెన్నులు పంచిన కిరణ్ అబ్బవరం?

ఈ ఏడాది ప్రారంభంలో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన కిరణ్ తాజాగా మరో సినిమాను లైన్ లో పెట్టేశారు. రీసెంట్ గా ఆయన నటించిన చిత్రం ‘మీటర్’.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. 2019 లో వచ్చిన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు కిరణ్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ లవ్ ప్లస్ కామెడీ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ హీరోగా చేసిన కిరణ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు కిరణ్. ఈ ఏడాది ప్రారంభంలో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన కిరణ్ తాజాగా మరో సినిమాను లైన్ లో పెట్టేశారు. రీసెంట్ గా ఆయన నటించిన చిత్రం ‘మీటర్’. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ తో పాటు సినిమా విడుదల తేదీను కూడా ప్రకటించారు. ఈ మేరకు కిరణ్ అబ్బవరం ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. 

టాలీవుడ్ లో హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తున్న హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. సినిమాల్లో నటించడమే కాదు ఆ సినిమాలను ఎలా ప్రచారం చేసుకోవాలో కూడా కిరణ్ కు బాగా తెలుసు. అందుకే ఆయన తన సినిమాలకు వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూ కనిపింస్తుంటారు. గతేడాది వరుసగా మూడు సినిమాలు కిరణ్ నుంచి వచ్చాయి. ఈ ఏడాది ఇది రెండో సినిమా. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ‘మీటర్’ ను రెడీ చేసేశారు కిరణ్. ఇటీవలే మూవీ టీమ్ ‘మీటర్’ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మార్చి 29 న ఈ మూవీ ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు కిరణ్ అబ్బవరం కూడా మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సినిమాను ఏప్రిల్ 7 న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షరాసే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ పెన్ పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఏప్రిల్ 7 న థియేటర్లలో కలుద్దాం అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు. ట్రైలర్ తో పాటు, మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో మూవీ పై ఆసక్తి పెరిగింది. 

Also Read: వేసవిలో వినోదం - సమ్మర్‌లో సందడి చేయనున్న సినిమాలివే, మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికీ?

View this post on Instagram
 
A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

ఇక ఈ మూవీ విషయానికొస్తే.. ఇది పక్కా పోలీస్ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. ఈ మూవీలో కిరణ్ కాప్ గా కనిపించనున్నారట. గతంలో ఆయన ‘సెబాస్టియన్’ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ పాత్ర చేసి ఆకట్టుకున్నారు. మరి ఈ సినిమాలో కిరణ్ పోలీస్ అధికారిగా ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి.  ఈ మూవీకు రమేష్ కాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. అందాల భామ అతుల్యా రవి హీరోయిన్ గా కనిపించనుంది. సాయి కార్తీక్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

Published at : 27 Mar 2023 09:23 AM (IST) Tags: Tollywood Kiran Abbavaram Athulya Ravi Meter Movie Meter Trailer Meter Release Date

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham June 9th: వేదని ఆదిత్యకి దూరంగా ఉండమన్న మాలిని- కొడుకు మనసులో విషాన్ని నింపుతున్న మాళవిక

Ennenno Janmalabandham June 9th: వేదని ఆదిత్యకి దూరంగా ఉండమన్న మాలిని- కొడుకు మనసులో విషాన్ని నింపుతున్న మాళవిక

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

టాప్ స్టోరీస్

AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు - ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !

AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు -  ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ