By: ABP Desam | Updated at : 26 Sep 2023 12:37 PM (IST)
దుల్కర్ సల్మాన్(Photo Credit: Dulquer Salmaan/Instagram)
‘సీతారామం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 24న పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా థియేటర్లలో అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తొలి షో నుంచే మిశ్రమ స్పందన లభించింది.
తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. అయితే, ఈ సినిమా విడుదలపై కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా సెప్టెంబర్ 22న ఓటీటీలోకి రాబోతోందని ప్రచారం జరిగింది. కానీ, సదరు ఓటీటీ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా హాట్ స్టార్ ఈ మూవీ రిలీజ్ కు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 29 నుంచి ‘కింగ్ ఆఫ్ కోత’ స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేసింది. తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
View this post on InstagramA post shared by Disney+ Hotstar Malayalam (@disneyplushotstarmalayalam)
‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఎమోషనల్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ సినిమా ఓ పట్టణం మీద ఆధిపత్యం చెలాయించాలనుకునే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. తండ్రిలా రౌడీ అవ్వాలనుకునే రాజు అనే కుర్రాడు తన కల నెరవేర్చుకునేందుకు ఏం చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ప్రేమ, స్నేహం విషయాల్లో ఎలాంటి ఎదురు దెబ్బలు తిన్నాడు? అనేది ఈ సినిమా కథాంశం. ఇందులో యాక్షన్ తో పాటుగా లవ్, సెంటిమెంట్, ఎమోషన్స్ కలగలిపి ఉన్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది.
అభిలాష్ జోషీ దర్శకత్వంలో దుల్కర్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. కానీ, ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు చాలా మందిని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా కనిపించింది. ‘గురు’ మూవీ బ్యూటీ రితికా సింగ్ స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. జీ స్టూడియోస్ సమర్పణలో దుల్కర్ సల్మాన్ హోమ్ ప్రొడక్షన్ వేఫేరర్ ఫిల్మ్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కింది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. బాక్సాఫీస్ దగ్గర అంతగా అలరించని ఈ సినిమా, ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.
Read Also: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Naga Panchami December 8th Episode విభూది దాటొద్దని మోక్షకు కండీషన్.. వీడ్కోలు చెప్పేసి తన చితి తానే పేర్చుకున్న పంచమి!
Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?
Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్లో ఏ కంపెనీ ఉందంటే?
/body>