News
News
X

Kiara Advani: దయ్యాలంటే భయం లేదు, కానీ ఆ రోజు మాత్రం చావు నుంచి బయటపడ్డా, గతాన్ని తలచుకున్న హీరోయిన్

కియారా అద్వాని తెలుగు వారికి కూడా పరిచయమైన హీరోయిన్. ఆమె తన జీవితంలోని ఓ సంఘటనను అభిమానులతో పంచుకుంది.

FOLLOW US: 
Share:

భరత్ అనే నేను సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కియారా. రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ బిజీ హీరోయిన్లలో కియారా ఒకరు. ఆమె నటించిన హారర్ - కామెడీ సినిమా ‘భూల్ భులయ్యా 2’ ఇటీవలే విడుదలైంది. త్వరలో మరో సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె ఒక మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను అభిమానులతో పంచుకుంది. హారర్ సినిమాలో నటించిన కియారా తనకు దయ్యాలంటే భయమే లేదని చెప్పుకొచ్చింది. దయ్యాలున్నాయంటే తాను నమ్మనని, దయ్యాల సినిమాలు కూడా చూడనని తెలిపింది. తాను ఒక్కతినే గదిలో పడుకోవాలి కనుక హారర్ సినిమాలు చూడడం మానేశానని చెప్పింది. తాను జీవితంలో ఓసారి మాత్రం చాలా భయపడ్డానని, చావు అంచుల దాకా వెళ్లొచ్చానని గుర్తు చేసుకుంది. 

ఆ రోజును మర్చిపోలేను...
కియారా తాను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ప్రమాదకరఘటనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నట్టు తెలిపింది. ఆ రోజును తలచుకుంటూ ఇలా చెప్పుకొచ్చింది... ‘కాలేజీ స్నేహితులతో కలిసి ధర్మశాలలోని మెక్ లియోడ్ గంజ్ అనే ప్రాంతానికి వెళ్లాము. అక్కడ విపరీతంగా మంచు పడుతోంది. ఎక్కడికీ వెళ్లలేక హోటల్లోనే నాలుగు రోజులు పాటూ ఉన్నాము. నీరు, ఆహారం కూడా సరిగా అందలేదు. గదిలో వెచ్చదనం కోసం వేసుకున్న మంట కూడా ఆరిపోయేలా అనిపించింది. నాలుగో రోజు అందరం నిద్రపోతున్నాం. ఆ మంట పక్కనే ఉన్న కుర్చీకి అనుకోకుండా అంటుకుంది. దీంతో గదిలో మంటలు చెలరేగాయి. గదంతా పొగ అలుముకుంది. మా స్నేహితుల్లో ఒకరికి మెలకువ వచ్చింది. ఆమె అందరినీ లేపింది. నాకు చాలా భయం వేసింది. దాదాపు ఆ పొగ, మంటలు చూశాక చావు అంచుల దాకా వెళ్లినట్టు అనిపించింది. మా అరుపులకి చుట్టు పక్కల వాళ్లంతా వచ్చి తలుపులు పగులగొట్టి, మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు’. ఈ ఘటన తన జీవితంలో చాలా భయపడిన సందర్భమని తెలిపింది. 

కియారా సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. డైరెక్ట్ సినిమాలు చేసేందుకు తాను ఇస్టపడతానని, రీమేక్ సినిమాలు చేసే ముందు చాలా సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెబుతోంది. తెలుగులో రెండు సినిమాల్లో నటించిన కియారా రామ్ చరణ్ తో కలిసి మరో సినిమాలో నటించబోతోంది.  

Also read: ‘మురారి వా’ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో వచ్చేసింది

Also Read: బాలకృష్ణకు జోడిగా నటించిన హీరోయినే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా?

Published at : 07 Jun 2022 05:09 PM (IST) Tags: Kiara Advani movies Kiara Advani heroine Kiara Advani life moments Kiara Advani Hit cinemas

సంబంధిత కథనాలు

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

MS Dhoni Tamil Film: ధోనీ ఎంటర్టైన్ మెంట్ తొలి సినిమా- పూజా కార్యక్రమాల పిక్స్ వైరల్

MS Dhoni Tamil Film: ధోనీ ఎంటర్టైన్ మెంట్ తొలి సినిమా- పూజా కార్యక్రమాల పిక్స్ వైరల్

Rakesh Sujatha Engagement: రాకింగ్ రాజేష్, సుజాత ఎంగేజ్మెంట్ వేడుకలో మంత్రి రోజా, బుల్లితెర స్టార్స్ సందడి

Rakesh Sujatha Engagement: రాకింగ్ రాజేష్, సుజాత ఎంగేజ్మెంట్ వేడుకలో మంత్రి రోజా, బుల్లితెర స్టార్స్ సందడి

RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు

RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు

RRR 100 Days : ఆర్ఆర్ఆర్ @ 100 డేస్ ఇన్ జపాన్ - రజనీకాంత్ రికార్డులు స్మాష్ 

RRR 100 Days : ఆర్ఆర్ఆర్ @ 100 డేస్ ఇన్ జపాన్ - రజనీకాంత్ రికార్డులు స్మాష్ 

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు

Waltair Veerayya Success Event :  వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు